Breaking News

ఎక్స్‌ట్రాలు ఎక్కువైతున్నాయ్‌.. ఇలాంటివారికి బుద్ధి చెప్పాల్సిందే!: హీరోయిన్‌

Published on Wed, 03/12/2025 - 18:18

సెలబ్రిటీలను నేరుగా చూడాలనుకోవడం, సెల్ఫీ తీసుకోవడం తప్పు లేదు. కానీ సందు దొరికింది కదా అని వారితో అతి చనువుగా ప్రవర్తిస్తూ, అసౌకర్యం కలిగేలా తాకితే మాత్రం ముమ్మాటికీ తప్పే అవుతుంది. ఇలా ఇబ్బందిపెట్టేవారిని చూసీ చూడనట్లుగా వదిలేయొద్దని, గుణపాఠం చెప్పి తీరాలంటోంది హీరోయిన్‌ రాగిణి ద్వివేది (Ragini Dwivedi). ఇటీవల ఆమె తన కొత్త పాటను లాంచ్‌ చేసింది. ఈ కార్యక్రమంలో ఆమె కాస్త ముందుకు రాగానే ఓ వ్యక్తి ఆమె చేయి పట్టుకుని లాగే ప్రయత్నం చేశాడు. 

అలాంటివారిని వదిలిపెట్టొద్దు
దీంతో తిక్క రేగిన ఆమె అతడి చెంప చెళ్లుమనిపించింది. నటి రియాక్షన్‌తో ఆ యువకుడు అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటన గురించి రాగిణి మాట్లాడుతూ.. అభిమానులు హద్దు మీరిన సందర్భాలు చాలా ఉన్నాయి. నటీమణుల విషయంలోనే కాదు నటుల విషయంలోనూ అలాగే ప్రవర్తిస్తున్నారు. ఒకరిని ఇబ్బందిపెట్టాలనుకోవడం, గాయం చేయాలనుకోవడం చాలా తప్పు. ఇలా చేస్తే ఏదో హైలైట్‌ అయిపోతామనుకుంటారు. అలాంటివారిని  కొట్టినా తప్పు లేదు.

పారిపోయాడు.. లేదంటేనా!
నన్ను ఇబ్బందిపెట్టిన వ్యక్తిని కొట్టకుండా నేనెందుకు ఊరుకుంటాను. అతడు వెంటనే అక్కడినుంచి పారిపోయాడు కానీ లేదంటే స్టేజీ దిగి మరో రెండు దెబ్బలు వేసేదాన్ని. అలాంటివారికి గుణపాఠం చెప్పాల్సిందే! అలా అయితేనే వారికి బుద్ధి వస్తుంది అని చెప్పుకొచ్చింది. ఎక్కువగా కన్నడ సినిమాలు చేసే రాగిణి ద్వివేది తెలుగులో జెండాపై కపిరాజు అనే సినిమాలో కనిపించింది. తమిళ, మలయాళంలోనూ మురిపించిన రాగిణి ప్రస్తుతం వృషభ, సారీ: కర్మ రిటర్న్స్‌ సినిమాలు చేస్తోంది.

చదవండి: హనీరోజ్‌ అమాయకురాలేం కాదు.. దేనికైనా లిమిట్‌ ఉంటుంది: నటి ఫైర్‌

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)