Breaking News

నయన్- ధనుశ్‌ వివాదం.. ఆ విషయం తెలిసి షాకయ్యా: రాధిక శరత్‌ కుమార్‌

Published on Mon, 11/18/2024 - 18:02

ధనుశ్- నయనతార వ్యవహారం కోలీవుడ్‌ను కుదిపేస్తోంది. ఇటీవల విడుదలైన నయనతార నెట్‌ఫ్లిక్స్‌ డాక్యుమెంటరీ బియాండ్ ది ఫెయిరీ టేల్‌ ఈ వివాదానికి కారణమైంది. ఆ డాక్యుమెంటరీ నానుమ్ రౌడీ ధాన్‌ మూవీలోని మూడు సెకన్ల వీడియోను ఈ డాక్యుమెంటరీలో ఉపయోగించారు. అయితే తన అనుమతి లేకుండా ఇలా చేయడం సరికాదని ధనుష్‌ రూ. 10 కోట్ల నష్ట పరిహారం కోరుతూ లీగల్‌ నోటీసు పంపించారు. దీంతో ఈ వివాదం కాస్తా కోలీవుడ్‌లో మరింత చర్చకు దారితీసింది.

అయితే తాజాగా ఈ వ్యవహారంపై సీనియర్ నటి రాధిక శరత్‌కుమార్‌ స్పందించారు. నానుమ్ రౌడీ ధాన్‌లో కీలక పాత్ర పోషించిన రాధిక ధనుశ్‌ ప్రవర్తనపై మాట్లాడారు. ఈ మూవీ సెట్స్‌లో నయనతార, విఘ్నేష్ శివన్‌ల ప్రేమ వ్యవహారం గురించి తనతో చెప్పాడని తెలిపింది. ఆ మూవీ షూటింగ్‌ టైమ్‌లో ధనుశ్ నాకు ఫోన్ చేసి ఈ విషయం చెప్పాడని వివరించింది. ధనుశ్ ఫోన్‌లో మాట్లాడుతూ అక్కా.. నీకు సిగ్గు లేదా? అని అడిగాడు. అతను ఏమి చెబుతున్నాడో నాకు అర్థం కాలేదు. 'ఏం జరుగుతుందో నీకు తెలియదా?, 'విక్కీ, నయన్‌లు డేటింగ్‌ చేస్తున్నారని ధనుశ్ నాతో అన్నాడని తాజాగా విడుదలైన డాక్యుమెంటరీలో రాధిక వివరించింది. ఆ తర్వాత వెంటనే 'ఏం మాట్లాడుతున్నావ్.. నాకేమీ తెలీదు' అని షాకింగ్‌కు గురైనట్లు డాక్యుమెంటరీలో చెప్పుకొచ్చింది.

కాగా.. నయనతార  డాక్యుమెంటరీలో నాగార్జున, రానా దగ్గుబాటి, తమన్నా భాటియా, ఉపేంద్ర, విజయ్ సేతుపతి, అట్లీ, పార్వతి తిరువోతు లాంటి స్టార్స్ కూడా కనిపించారు. కేవలం మూడు సెకన్ల ఫుటేజీని ఉపయోగించినందుకు ధనుశ్‌ లీగల్ నోటీసులు పంపడంతో ఈ వివాదం మరింత ముదిరింది.
 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)