ఇజ్రాయెల్ పై ట్రంప్ ప్రశంసల వర్షం
Breaking News
లెజెండరీ డైరెక్టర్ ఇలా అయిపోయారేంటి? వైరల్ వీడియో
Published on Sun, 04/19/2026 - 16:13
తమిళ దిగ్గజ దర్శకుడు భారతీరాజా ప్రస్తుతం అడపాదడపా సినిమాల్లో నటిస్తున్నారు. నాలుగు నెలల క్రితం ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ రావడంతో ఆస్పత్రిలో చేర్చగా తర్వాత డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చేశారు. ప్రస్తుతం కోలుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈయన్ని ఒకప్పటి హీరోయిన్ రాధిక వెళ్లి పరామర్శించింది. భావోద్వేగానికి గురవుతూ ఓ వీడియోని సోషల్ మీడియాలో పంచుకుంది.
(ఇదీ చదవండి: తల్లి కాబోతున్న మరో తెలుగు సీరియల్ హీరోయిన్)
రాధిక రీసెంట్‌గా లీడ్ రోల్ చేసిన 'తాయ్ కిళవి' సినిమాని భారతీ రాజా చూశారు. దీని గురించి రాధిక ఆయన మధ్య చర్చ కూడా జరిగింది. సినిమా చూశారా అని రాధిక అడగ్గా.. చూశానని చెప్పిన భారతీరాజా, ఈ చిత్రానికి మీకు జాతీయ అవార్డ్ అందుకుంటారని అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో ఆశ్చర్యానికి గురైన రాధిక.. అదే జరిగితే, ఆ అవార్డుని మీ పాదాల దగ్గర అర్పిస్తానని స్పందించింది.
ఇన్ స్టాలో భారతీరాజాతో మాట్లాడుతున్న వీడియోని పోస్ట్ చేసిన రాధిక.. ఆయన ఆశీర్వాదం, అవార్డు కంటే గొప్పది. ఆయనని ఈ స్థితిలో చూస్తాననుకోలేదు. చాలా బాధగా ఉంది. ఇప్పటికీ సినిమాపై ఉన్న ప్రేమే ఆయనని ముందుకు నడిపిస్తోంది అని రాసుకొచ్చింది. ఈ వీడియో చూసిన చాలామంది.. ఎలా ఉండే భారతీరాజా ఇలా అయిపోయారేంటి అని మాట్లాడుకుంటున్నారు. ఈయన చివరగా గతేడాది రిలీజైన 'దేశియా తలైవర్' సినిమాలో నటించారు.
(ఇదీ చదవండి: బూతు కాదు నేను పోస్ట్ చేస్తున్నది భక్తి కంటెంట్: అనన్య నాగళ్ల)
Tags : 1