Breaking News

నా శరీరం, నా ఇష్టం.. బయటకు చెప్పాల్సిన అవసరం లేదు: నటి

Published on Sat, 01/24/2026 - 17:00

బాడీ షేమింగ్‌కు గురై ఆత్మహత్యలు చేసుకునేవారంతా తన దృష్టిలో మూర్ఖులేనని అన్నారు ప్రముఖ నటి రచితా రామ్‌. రజనీకాంత్‌ ‘కూలి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైన నటి రచితా రామ్‌. ఆ సినిమాలో మాస్‌ విలన్‌ పాత్రలో నటించి, మెప్పించింది. ప్రస్తుతం కన్నడ సినిమాలతో బిజీగా ఉన్నారు.

ఆమె నటించిన తాజా కన్నడ చిత్రం ‘కల్ట్‌’ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఈవెంట్‌లో బాడీ షేమింగ్‌ గురించి రచితా(Rachita Ram ) మాట్లాడారు. చాలా మంది ఆడపిల్లలాగే తాను కూడా బాడీ షేమింగ్‌ ఎదుర్కొన్నానని.. కానీ దాన్ని చాలా తెలివిగా హ్యాండిల్‌ చేశానని చెప్పారు. వాళ్ల కామెంట్స్‌ని పట్టించుకోకుండా..మన పని మనం చేసుకుంటే సరిపోతుందని ఆమె సలహా ఇచ్చారు.

‘ప్రతి మహిళ శరీరంలో మార్పులు వస్తుంటాయి. ఒక్కొక్కరు ఒక్కో కారణంతో బరువు పెరుగుతుంటారు. పీసీఓడీ, ఒత్తిడి వల్ల కొంతమంది లావు అవుతుంటారు. పీరియడ్స్‌కి ముందు, తర్వాత కూడా శరీరంలో మార్పులు వస్తుంటాయి. నిద్ర కూడా మన శరీరంపై ప్రభావం చూపుతుంది. 

కొంతమందికి ఎనిమిది గంట నిద్ర కచ్చితంగా అవరసరం ఉంటుంది. లేదంటే వాళ్ల బాడీలో మార్పులు వచ్చేస్తుంటాయి. నేను కూడా ఆ లిస్ట్‌లోకి వస్తా. నేను సరిగా నిద్రపోకపోతే.. ఉదయం నా మొఖం చాలా ఉబ్బుగా కనిపిస్తుంది. కొన్ని గంటల తర్వాత మళ్లీ సన్నబడుతుంది. నాతో పని చేసే దర్శకులు కూడా ఇది గమనించి చెప్పారు. ఇలాంటి సమస్యలు చాలా మంది మహిళలకు ఉంటాయి. ఇవన్నీ బయటకు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మనకి నచ్చినట్లుగా మనం ఉండాలి. ఇది నా శరీరం.. నా ఇష్టం. ఎందుకు లావు అయ్యామో.. ఎందుకు సన్నబడ్డామో అనే విషయాలను ఎవరికీ వివరించాల్సిన అవసరం లేదు. మన ఆరోగ్యం గురించి వేరేవాళ్లకు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు.  అని రచితా చెప్పుకొచ్చారు.

అలాగే  ఆన్‌లైన్‌లో వచ్చే నెగెటివ్‌ కామెంట్స్‌, ట్రోలింగ్‌ని ఎలా హ్యాండిల్‌ చేయాలనేదాని గురించి మాట్లాడుతూ.. ‘    అసలు నెగెటివ్‌ కామెంట్స్‌ని ఎందుకు చూడాలి? ఎందుకు వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి? అలాంటి విషయాలను మీరు మైండ్‌లోకి తీసుకోకండి. వాటిని పట్టించుకోకుండా.. మన పని మనం చేసుకుంటేనే  ప్రశాంతంగా ఉంటాం’ అని రచితా రామ్‌ చెప్పుకొచ్చింది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)