Breaking News

మోహన్‌ బాబు 24వరకు టైమ్‌ అడిగారు: రాచకొండ సీపీ

Published on Mon, 12/16/2024 - 13:01

టాలీవుడ్‌ ఇండస్ట్రీకి చెందిన మంచు ఫ్యామిలీలో కొద్దిరోజులుగా గొడవలు, కేసులు వంటి ఘటనలు జరుగుతున్నాయి. జల్‌పల్లిలో తన నివాసం వద్ద  మీడియా ప్రతినిధిని మోహన్‌బాబు కొట్టడంతో ఆయనపై కేసు నమోదు అయింది. ఇప్పటికే ఆయన మీద మనోజ్‌ కూడా ఒక కేసు పెట్టడం జరిగింది. ఆపై మనోజ్‌పై కూడా ఒక కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే, మోహన్ బాబు ఫ్యామిలీపై రాచకొండ సీపీ తాజాగా మీడియాతో మాట్లాడారు.

'ఇప్పటికీ మంచు కుటుంబంపై 3 FIRలు నమోదు అయ్యాయి. వాటిపై మేము విచారణ ప్రారంభించాము. చట్టప్రకారంగా మాత్రమే మేము చర్యలు తీసుకుంటాం. మోహన్ బాబు అరెస్ట్ విషయంలో ఆలస్యం లేదు. ఆయనకు ఇప్పటికే నోటీసు ఇచ్చాము. కానీ, డిసెంబర్‌ 24 వరకు టైమ్‌ అడిగారు. కోర్టు సమయం ఇచ్చింది కాబట్టి మేము అరెస్ట్ చేయలేదు.మోహన్ బాబు విచారణపై మేము కూడా కోర్టును ఆశ్రయిస్తాము. ఆయన వద్ద రెండు గన్స్‌ ఉన్నాయి. కానీ, రాచకొండ స్టేషన్‌ నుంచి ఆయన ఎలాంటి పర్మిషన్ గన్స్ ఇవ్వలేదు. మరోకసారి మోహన్‌బాబుకు నోటీసు ఇస్తాం. అప్పుడు ఆయన తప్పకుండా విచారణకు రావాలి. లేదంటే వారంటీ ఇష్యు చేస్తాము. ఒకవేళ మళ్లీ విచారణకు ఆయన రాకపోతే కోర్టు అనుమతి తీసుకోవాలి. లేదంటే చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం.' అని సీపీ అన్నారు.

లైసెన్స్‌డ్‌ గన్స్‌ సరెండర్‌ చేసిన మోహన్‌ బాబు
మోహన్‌బాబు తన వద్ద ఉన్న లైసెన్స్‌డ్‌ గన్‌ను సరెండర్‌ చేశారు. ఆయన ఇంట్లో వివాదాలు రావడంతో తుపాకుల్ని సరెండర్‌ చేయాలని  పోలీసులు కోరారు. దీంతో తన పీఆర్వో ద్వారా డబుల్‌ బ్యారెల్‌ గన్‌ను చంద్రగిరి పోలీసులకు అప్పగించారు. ఆయన వద్ద రెండు గన్స్‌ ఉన్నాయి.  డబుల్‌ బ్యారెల్‌ గన్‌తో పాటు  స్పానిష్ మెడ్ గన్ ఉంది.

Mohan babu: గన్‌ సరెండర్‌ చేసిన మోహన్‌బాబు

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)