Breaking News

రజినీకాంత్‌తో నటించావా? అని అడిగారు.. రాయన్‌ ఫేమ్‌ ఆసక్తికర కామెంట్స్!

Published on Mon, 09/30/2024 - 13:46

ధనుశ్ ఇటీవలే రాయన్‌ మూవీతో అభిమానులను ‍అలరించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో టాలీవుడ్ హీరో సందీప్ కిషన్‌.. ధనుశ్ తమ్ముడి పాత్రలో మెప్పించాడు. అయితే ఈ చిత్రం ధనుశ్‌కు సోదరిగా నటించిన దుషారా విజయన్‌ అభిమానుల ఆదరణ దక్కించుకుంది. రాయన్ మూవీతో ఒక్కసారిగా ఫేమస్‌ అయిపోయింది. ప్రస్తుతం ఆమె రజినీకాంత్‌ వెట్టైయాన్‌ చిత్రంలో కనిపించనుంది.

దసరాకు ఈ మూవీ రిలీజ్ కానుండగా.. ప్రమోషన్లతో బిజీగా ఉంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ధనుశ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఆ హీరో అంటే తనకెంతో ఇష్టమని చెప్పింది. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టక ముందే ఆయన్ని అభిమానిస్తున్నట్లు తెలిపింది. నేను రజనీకాంత్‌ మూవీలో యాక్ట్‌ చేస్తున్నానని తెలిసి ధనుశ్‌ ఆనందించారని వెల్లడించింది.

దుషారా విజయన్ మాట్లాడుతూ..'ధనుశ్‌ ఓసారి నా వద్దకు వచ్చారు. రజినీకాంత్‌ సర్‌తో యాక్ట్‌ చేశావా? అని అడిగారు. అవునని చెప్పా. ఆయన వెంటనే ఈ విషయంలో నిన్ను చూసి అసూయపడుతున్నా.. ఎందుకంటే నేను ఇంకా ఆయనతో కలిసి నటించలేదన్నారు. రజనీకాంత్‌ను ఆయన ఎంతలా ఇష్టపడతారో ఆ రోజే నాకర్థమైంది' అని  ఆమె అన్నారు.‌ 

Videos

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)