Breaking News

రాధిక శరత్‌కుమార్‌కు ఎన్ని కోట్ల ఆస్తులున్నాయో తెలుసా?

Published on Tue, 03/26/2024 - 14:20

ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల్లో బాలీవుడ్‌తో పాటు దక్షిణాది హీరోయిన్లు సైతం పోటీ పడుతున్నారు. ఇటీవలే కంగనా రనౌత్‌కు సైతం బీజేపీ లోక్‌సభ సీటును కేటాయించింది. అంతకుముందే సీనియర్ నటి రాధికా శరత్‌ కుమార్‌కు బీజేపీ అధిష్టానం ఎంపీ టికెట్‌ ఇచ్చింది. ఆమె తమిళనాడులోని విరుధునగర్‌ నుంచి పోటీలో నిలిచారు.

ఈ నేపథ్యంలో రాధిక శరత్‌కుమార్‌ ఆస్తులపై చర్చ మొదలైంది. ఎందుకంటే ఎన్నికల్లో పోటీ చేసేవారు అఫిడవిట్‌లో తప్పనిసరిగా ఆస్తులు వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. ఇ‍ప్పటికే తొలి దశ పోలింగ్‌కు నోటిఫికేషన్‌ రిలీజ్ కావడంతో అభ్యర్థులు నామపత్రాలను సమర్పిస్తున్నారు. ఈ సందర్భంగా  విరుధునగర్‌ నుంచి పోటీ చేస్తున్న రాధిక నామినేషన్ దాఖలు చేసింది. ఎన్నికల అధికారులకు సమర్పించిన అఫిడవిట్‌లో తన ఆస్తులను ప్రస్తావించారు. తన మొత్తం ఆస్తుల విలువను రూ.53.45 కోట్లుగా పేర్కొన్నారు. 
 
తన వద్ద ప్రస్తుతం రూ.33.01 లక్షల నగదు, 75 తులాల బంగారం, 5 కేజీల వెండి ఆభరణాలు, ఇతర వస్తువులతో కలిపి రూ.27.05 కోట్ల చరాస్తులున్నట్లు రాధిక నామినేషన్ పత్రాల్లో వెల్లడించారు. రూ.26.40 కోట్ల స్థిరాస్తులతో పాటు రూ.14.79కోట్ల అప్పులు ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆమె రాడాన్‌ మీడియా వర్క్స్‌ ఇండియా లిమిటెడ్‌ సంస్థకు మేనేజింగ్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నట్లు  పేర్కొన్నారు. కాగా.. రాధిక భర్త, నటుడు ఆర్‌. శరత్‌ కుమార్‌ తన పార్టీ ఆల్‌ ఇండియా సమతువ మక్కల్‌ కట్చిని భాజపాలో విలీనం చేసిన సంగతి తెలిసిందే.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)