Breaking News

వెండితెరపై మరో మహానుభావుడి బయోపిక్.. టైటిల్ రోల్‌లో మాధవన్!

Published on Wed, 07/08/2026 - 14:35

భారత దిగ్గజ ఆవిష్కర్త కోయంబత్తూర్‌ కు చెందిన జీడీ నాయుడు  గురించి  ఈ తరం వారికి పెద్దగా తెలిసి ఉండక పోవచ్చు. ఆయన (1893–1974) కాలంలోనే  ఎడిషన్‌ ఆప్‌ ఇండియా, వెల్త్‌ క్రయేటర్‌ ఆఫ్‌ కోయంబత్తూర్‌ గా ప్రసిద్ధి స్వయం కృషితో ఎదిగిన  గొప్ప ఆవిష్కర్త, పారిశ్రామిక వేత్త, విద్యా సేవకుడు. దక్షిణ భారత పారిశ్రామిక అభివద్ధికి బలమైన పునాదులు వేశారు. భారత దేశంలో తొలి ఎలక్ట్రిక్‌ మోటార్,రాసంట్‌ రేజర్, ఓటు నమోదు యంత్రం, 1952లో రూపొందించిన రెండు సీట్ల పెట్రోల్‌ కారు వంటి పలు ఆవిష్కరణల కర్త ఈయన. సర్‌ సీవీ.రామన్, సర్‌  ఎం.విశ్వేశ్వరయ్య, డా.అంబేడ్కర్‌ వంటి మహానీయులు ప్రశంసలు అందుకున్న గొప్ప ఆవిష్కర్త జీడీ.నాయుడు. 

1967లోనే పద్మశ్రీ పురస్కారాన్ని పొందిన జీడీ నాయుడు జీవిత చరిత్ర ఆధారంగా ఇప్పుడు జీడీఎన్‌ పేరుతో  చిత్రం రూపొందడం విశేషం. ఈ చిత్రంలో నటుడు మాధవన్‌ టైటిల్‌ పొత్రను పోషించడం మరో విశేషం.నటుడు సత్యరాజ్, ప్రియమణి, దంషారా విజయన్,  వినయ్‌ రాయ్, తంబి రామయ్య,నందలాల్, షీలా,కరుణాకరన్,మురళిధరన్,అతిది బాలన్‌ మొదలగు పలువురు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కథ, దర్శకత్వం బాధ్యతలను కష్ణకుమార్‌ రామ్‌ కుమార్‌ నిర్వహించారు. వర్గీస్‌ మూలన్, విజయ్‌ మూలన్, మాధవన్‌ కలిసి నిర్మించిన ఈ చిత్రానికి అరవింద్‌ కమలనాధన్‌ ఛాయాగ్రహణం, గోవింద్‌ వసంత్‌ సంగీతాన్ని అందించారు.

నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో పాన్‌ ఇండియా స్థాయిలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర ఆడియో, ట్రైలర్‌ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఇటీవల కోయంబత్తూర్‌ లోని ప్రసిద్ధి చెందిన కరీ మోటార్‌ స్పీడ్‌ వే లో ఘనంగా నిర్వహించారు. నటుడు, నిర్మాతల్లో ఒకరైన మాధవన్‌ మాట్లాడుతూ  ‘‘ జీడీ నాయుడు కేవలం ఆవిష్కర్త మాత్రమే కాదు .ఆయన గొప్ప దూరదృష్టి కలిగిన వ్యక్తి. అసాధారణ విజయాలను సాధించిన మహానుభావుడు.అంతకంటే ముఖంగా నిజమైన దేశభక్తుడు.ఆయన సేవలు అన్ని రంగాల్లోనూ విస్తరించాయి.అంతటి అద్భుతమైన జీవిత చరిత్ర తమిళనాడుకే కాకుండా దేశమంతటికి తెలియాల్సిన అవసరం ఉందని భావించాం.అదే  జీడీఎన్‌ చిత్రం.’’ అని మాధవన్‌ పేర్కొన్నారు. 

Videos

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)