Breaking News

'పుష్ప2' మేకింగ్‌ వీడియో.. బెంగాల్‌లో బన్నీ ఆల్‌ టైమ్‌ రికార్డ్‌

Published on Thu, 01/09/2025 - 08:24

పుష్పరాజ్‌గా అల్లు అర్జున్‌ (Allu Arjun) నటనకు సినీ అభిమానులు ఫిదా అవుతున్నారు. దీంతో ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద భారీ కలెక్షన్స్‌తో బన్నీ అస్సలు తగ్గడం లేదు. వసూళ్ల విషయంలో కనపడిన ప్రతి రికార్డ్‌ను రప్పా రప్పా అంటూ సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు. ఇంతలోనే పుష్ప రీలోడ్‌ వర్షన్‌ పేరుతో జనవరి 17న మళ్లీ థియేటర్స్‌లోకి రానున్నాడు. దీంతో తాజాగా ఈ చిత్రం నుంచి మేకింగ్‌ వీడియోను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది.

కేవలం 32 రోజుల్లోనే ‘పుష్ప 2 : ది రూల్‌’ (Pushpa 2: The Rule ) ప్రపంచ వ్యాప్తంగా రూ.1831 కోట్ల గ్రాస్‌ వసూళ్లు సాధించి, సరికొత్త రికార్డు సృష్టించినట్లు మేకర్స్‌ ప్రకటించారు. అల్లు అర్జున్ , రష్మికా మందన్నా(Rashmika Mandanna) జోడీగా నటించిన చిత్రం ‘పుష్ప 2: ది రూల్‌’. సుకుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీలీల ప్రత్యేకపాటలో ప్రేక్షకులను మెప్పించారు. సుకుమార్‌ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్  ఎర్నేని, యలమంచిలి రవిశంకర్‌ నిర్మించిన ఈ సినిమా డిసెంబరు 5న విడుదలైంది. 

(ఇదీ చదవండి: నయనతార, ధనుష్‌ కేసు విచారణలో ఏం జరిగిందంటే..?)
అయితే, 22నిమిషాల నిడివిని అదనంగా ఈ చిత్రానికి కలపనున్నారు. వాస్తవంగా పుష్ప2 రీలోడ్‌ వర్షన్‌ జనవరి 10వ తేదీనే విడుదల చేస్తామని చిత్ర యూనిట్‌ ప్రకటించింది. అయితే, సంక్రాంతి రేసులో మూడు సినిమాలు వస్తుండటంతో కలెక్షన్స్‌ పరంగా వాటిపై ప్రభావం చూపించవచ్చని విడుదలను వాయిదా వేసుకున్నారు. దీంతో జనవరి 17న రీలోడ్‌ వర్షన్‌ రిలీజ్‌ అవుతుందని మేకర్స్‌ ప్రకటించడం విశేషం.

బెంగాల్‌లో పుష్పరాజ్‌ ఆల్‌ టైమ్‌ రికార్డ్‌
బెంగాల్‌లో పుష్ప ఓ రికార్డ్‌ సాధించింది. మామూలుగా బెంగాలీ సినిమా మార్కెట్‌ చాలా చిన్నదని తెలిసిందే. అక్కడ ఎక్కువగా తక్కువ బడ్జెట్‌ చిత్రాలు మాత్రమే తెరకెక్కుతుంటాయి. ఈ నేపథ్యంలో ‘పుష్ప 2’ బెంగాల్‌లో రూ. 50 కోట్లు వసూలు చేసి, సంచలనం సృష్టించింది. కాగా ‘అమేజాన్‌ ఓబిజాన్‌’ (2017) అనే చిత్రం రూ. 48 కోట్ల వసూళ్లతో అప్పట్లో రికార్డ్‌ నెలకొల్పింది. ఇది స్ట్రయిట్‌ చిత్రం. ఆ రికార్డును తాజాగా ‘పుష్ప 2’ బ్రేక్‌ చేసింది. ఒక డబ్బింగ్‌ సినిమా ఇలా ఆల్‌ టైమ్‌ రికార్డ్‌ నెలకొల్పడం అంటే మామూలు విషయం కాదని చెప్పవచ్చు.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)