Breaking News

ప్రభాస్‌తో పూరి జగన్నాథ్‌ సినిమా... ఈ సారి డైరెక్షన్‌ కాదు!

Published on Sat, 11/09/2024 - 15:36

హీరో ప్రభాస్, డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ మూడో సారి కలసి పని చేయనున్నారని ఫిల్మ్‌నగర్‌ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ప్రభాస్‌ హీరోగా ‘బుజ్జిగాడు’(2008), ‘ఏక్‌ నిరంజన్‌’(2009) వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు పూరి జగన్నాథ్‌. అయితే మూడోసారి మాత్రం ప్రభాస్‌ చిత్రాన్ని డైరెక్షన్‌ చేయడం లేదు పూరి. ‘స్పిరిట్‌’ చిత్రానికి పూరి జగన్నాథ్‌ డైలాగులు అందించబోతున్నారని టాక్‌. 

ప్రభాస్‌ హీరోగా సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్‌’ అనే  పాన్‌ ఇండియా సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లనుంది. కాగా ‘స్పిరిట్‌’ సినిమాకి డైలాగ్స్‌ రాసే బాధ్యతను పూరి జగన్నాథ్‌కు సందీప్‌ రెడ్డి అప్పగించినట్లు సినీ సర్కిల్స్‌లో టాక్‌ వినిపిస్తోంది. 

సందీప్‌ స్వయంగా అడగడంతో పూరి కూడా పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. ఇందుకు ప్రభాస్‌తో తనకున్న స్నేహ బంధం ఓ కారణం అయితే.. సందీప్‌ స్టోరీకి డైలాగులు రాస్తే అది మరింతగా రీచ్‌ అవుతుందన్నది మరో ఆలోచన అట. అందువల్లే ఆయన అంగీకరించి ఉంటారని భోగట్టా. అయితే ఈ విషయంపై స్పష్టత రావాలంటే యూనిట్‌ అధికారికంగా ప్రకటించే వరకూ వేచిచూడాల్సిందే. ఇదిలా ఉంటే.. ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ చిత్రం తర్వాత పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహించే సినిమాపై స్పష్టత రావాల్సి ఉంది.

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)