Breaking News

బాలకృష్ణ విలన్‌ను ఎంపిక చేసుకున్న పూరీ జగన్నాథ్‌

Published on Tue, 04/29/2025 - 07:10

విజయ్‌ సేతుపతి- పూరీ జగన్నాథ్‌ కాంబినేషన్‌ సినిమాలో ప్రముఖ కన్నడ హీరోకు ఛాన్స్‌ దక్కింది. ఈమేరకు ఒక ఫోటోను కూడా పూరీ పంచుకున్నారు. కన్నడ పరిశ్రమలో పాపులర్ హీరోగా గుర్తింపు పొందిన దునియా విజయ్‌ (Duniya Vijay) బాలకృష్ణతో వీరసింహారెడ్డి (Veera Simha Reddy) మూవీతో తెలుగు పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చారు. అందులో ముసలిమడుగు ప్రతాప్‌ రెడ్డి పాత్రలో ఆయన దుమ్మురేపారని చెప్పవచ్చు. ఆయనకు గతంలోనే టాలీవుడ్‌ నుంచి ఎన్నో ఛాన్సులు వచ్చాయి. కానీ, ఆ సమయానికి తను హీరోగా వేరే చిత్రాలతో బిజీగా ఉండటం వల్ల ఆ అవకాశాలు వదులుకున్నాడు. అయితే, బాలకృష్ణ సినిమాతో ఇక్కడ బాగా గుర్తింపు పొందాడు. దీంతో ఆయన భారీ సినిమాల్లో ఛాన్సులు వస్తున్నాయి.

విజయ్‌ సేతుపతి హీరోగా పూరి జగన్నాథ్‌( Puri Jagannadh) దర్శకత్వంలో ‘బెగ్గర్‌’ (ప్రచారంలో ఉన్న టైటిల్‌) అనే చిత్రం రానుంది. పూరి జగన్నాథ్, చార్మీ కౌర్‌ నిర్మించనున్న ఈ సినిమా చిత్రీకరణ జూన్‌లో ఆరంభం అవుతుంది. ఈ సినిమాలోని ఓ కీలక పాత్రలో దునియా విజయ్‌ నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీంతో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు మరింత పెరిగాయని చెప్పవచ్చు.

మరోవైపు దాదాపు ఐదు సంవత్సరాల విరామం తరువాత 'టబు' ఈ సినిమాతోనే రీఎంట్రీ ఇస్తుంది. కేవలం మంచి పాత్రలు దొరికితేనే నటిస్తానన్న టబు(Tabu) పూరీ సినిమాలో తన పాత్ర చాలా కొత్తగా, వైవిద్యంగా, బలంగా ఉంటుందని తెలిపింది. రాధికా ఆప్టే కూడా చాలా కాలం తర్వాత టాలీవుడ్‌లోకి ఇదే మూవీతో రానుందన ప్రచారం జరుగుతుంది. తెలుగుతో పాటు హింది, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. చూస్తుంటే ఈ సారి పూరీ ఏదో కొత్తగా ప్లాన్‌ చేసినట్టే ఉన్నాడు.

Videos

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)