Breaking News

ఆరోగ్యంపై స్పందించిన పంచ్‌ ప్రసాద్‌, ముక్కులోంచి రక్తం...

Published on Sat, 02/25/2023 - 15:21

జబర్దస్త్‌ కమెడియన్‌ ‘పంచ్‌’ ప్రసాద్‌ కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల తీవ్ర అనారోగ్యం బారిన పడటంతో పంచ్‌ ప్రసాద్‌కు సాయం చేసేందుకు తన తోటి కంటెస్టెంట్స్‌ ముందుకు వస్తున్నారు. ఇప్పటికే ‘కిరాక్‌’ ఆర్పీ పంచ్‌ ప్రసాద్‌ ఆపరేషన్‌కు అయ్యే ఖర్చు అంతా తానే భరిస్తానని ఇటీవల ఓ ఇంటర్య్వూలో వెల్లడించాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం స్వల్పంగా కోలుకున్న పంచ్‌ ప్రసాద్‌ ఇటీవల ఓ యూట్యూబ్‌ చానల్‌కు ఇంటర్య్వూ ఇచ్చాడు. ఈ సందర్బంగా తన ఆరోగ్యంపై స్పందిస్తూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. 

చదవండి: నన్ను పెళ్లి చేసుకుంటారా? స్టార్‌ హీరోయిన్‌ ఓపెన్‌ కామెంట్స్‌  

తనకు సాయం చేసేందుకు చాలా మంది జబర్దస్త్‌ కంటెస్టెంట్స్‌ ముందుకు వచ్చారని, వారందరికీ రుణపడి ఉంటానన్నాడు. ‘పెళ్లయిన కొత్తలో నా ముక్కులో నుంచి తరచూ రక్తం రావడంతో నా భార్య ఆస్పత్రికి తీసుకెళ్లింది. అప్పడే నా రెండు కిడ్నిలు పాడయ్యాయని డాక్టర్లు చెప్పారు. కిడ్ని సమస్యలు ఉన్న వారిలో ఒక్కొక్కరికి ఒక్కోలా ప్రభావం చూపిస్తుంది. నా కాలు ఎముకకు చీము రావడంతో నడవలేని స్థితికి వెళ్లిపోయా. ప్రస్తుతానికి స్వల్పంగా కోలుకున్నా. షోలు కూడా చేసుకుంటున్నా. ఇప్పుడు బాగానే నడుస్తున్నాను. త్వరలోనే ఆపరేషన్‌ కూడా చేయించుకోబోతున్నా’ అని చెప్పాడు. 

చదవండి: అంతర్జాతీయ వేదికపై ఆసక్తికర సంఘటన, స్టేజ్‌పైనే చరణ్‌కు క్షమాపణలు చెప్పిన నటి

అయితే తన కాలుకు చీము రావడం వల్లే ఆపరేషన్‌ని వాయిదా వేశారని తెలిపాడు. ఇప్పటికే తనకి కిడ్నీ డోనర్‌ దొరికారని, కాలు నొప్పి తగ్గే వరకు డాక్టర్లు ఆపరేషన్‌ చేయమని చెప్పారని పంచ్‌ ప్రసాద్‌ పేర్కొన్నాడు. అయితే తాను త్వరగా కోలుకోవాలని చాలా మంది తన కోసం ప్రార్థించారని, ఓ అభిమాని అయితే కుటుంబంతో సహా తిరుపతి వెళ్లి కాళి నడకన ఏడుకొండలు ఎక్కాడంటూ పంచ్‌ ప్రసాద్‌ ఆసక్తిక విషయం చెప్పాడు. అప్పుడే తనని ఇంతలా అభిమానించే అభిమానులు ఉన్నారా? అని ఆశ్చర్యం వేసిందన్నాడు. అనంతరం తన కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞుడిని అని అన్నాడు. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)