Breaking News

'ఆపరేషన్ వాలెంటైన్' చూసి గర్వపడతారు: నిర్మాతలు

Published on Wed, 02/28/2024 - 18:14

మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ హీరో నటించిన తాజా చిత్రం ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’. సోనీ పిక్చర్స్‌ ఇంటర్నేషనల్‌ ప్రొడక్షన్స్, సందీప్‌ ముద్దా రినైసన్స్‌ పిక్చర్స్‌పై ఈ చిత్రం రపొందింది. ఈ సినిమా మార్చి 1న తెలుగు, హిందీ భాషల్లో విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా నిర్మాతలు సిద్దు ముద్దా, నందకుమార్ అబ్బినేని మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. 

అలా ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ మొదలైంది
దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ చేసిన షార్ట్ ఫిల్మ్ నాకు(సిద్దు ముద్దా), వరుణ్ కి చాలా నచ్చింది. దాన్నే ఫుల్ లెంత్ ఫీచర్ ఫిల్మ్ గా చేయాలనే ప్రయత్నాల్లో దర్శకుడు ఉన్నప్పుడు, నేను, వరుణ్ కలసి కథ విన్నాం. కథ విన్న వెంటనే మాకు చాలా నచ్చింది. వెంటనే సినిమా చేయాలని అనుకున్నాం. సోనీ పిక్చర్స్ నిర్మాణ భాగస్వామిగా రావడంతో తెలుగు, హిందీలో చాలా గ్రాండ్ రూపొందించాం. శక్తి ప్రతాప్ కి చాలా క్లారిటీ ఉంది. తన విజన్ క్లియర్ గా ఉంటుంది, సినిమాకి ఏం కావాలో తనకి చాలా స్పష్టంగా తెలుసు. అలాగే తనకు వీఎఫ్ఎక్స్ పై చాలా మంచి కమాండ్ ఉంది. తను అదే నేపథ్యం నుంచి వచ్చారు. ఫైటర్ తర్వాత ఇలాంటి భారీ ఎయిర్ సీక్వెన్స్ తో ఇండియాలో వచ్చిన సినిమా ఇదే. సినిమాని చాలా అద్భుతంగా తీశాడు. 

ఎయిర్ ఫోర్స్ అధికారులు ప్రశంసించారు
ఆపరేషన్‌ వాలెంటైన్‌ సినిమాను ఎయిర్ ఫోర్స్ అధికారులకు చూపించాం. సినిమా మొత్తం చూసిన తర్వాత  చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఏం చెప్పారో అదే తీశారని ప్రశంసించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో కూడా వారు చాలా సపోర్ట్ చేశారు. రియల్ ఎయిర్ బేస్ లో షూట్ చేయడం ఒక డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్. సైనికులు త్యాగాలని, ధైర్య సాహసాలని స్మరించుకుంటూ వాళ్ళ కథని ప్రేక్షకులకు చూపించాలనే గొప్ప ఉద్దేశంతో ఈ సినిమా చేశాం. 'ఆపరేషన్ వాలెంటైన్' చేస్తున్న క్రమంలో ఇలాంటి రియల్ హీరోస్ సినిమాలు మరిన్ని చేయాలనే స్ఫూర్తి కలిగింది. తప్పకుండా ఈ సినిమా అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది.

మిక్కీ జే మేయర్ బీజీఎం అదరగొట్టేశాడు
ఈ సినిమాకు మిక్కీ జే మేయర్‌ అద్భుతమైన సంగీతం అందించాడు. ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ దృష్టిలో పెట్టుకొని తెలుగు ఫ్లేవర్ మిస్ కాకుండా మ్యూజిక్ ఇచ్చారు. పాటలు ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాయి. ఇప్పటికే పాటలకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే నేపధ్య సంగీతం కూడా అద్భుతంగా ఉంటుంది. ఈ మూవీతో వరుణ్‌కి బాలీవుడ్‌లో మంచి గుర్తింపు వస్తుంది.

నితిన్‌తో ఓ సినిమా?
వరుణ్ తేజ్ తో ఇది మాకు రెండో సినిమా(గతంలో ‘గని’ అనే సినిమాను నిర్మించారు). ఇకపై బయట హీరోలతోనూ సినిమాలు చేస్తాం.  నితిన్ తో ఓ సినిమా అనుకుంటున్నాం. ప్రస్తుతం మా దృష్టి  'ఆపరేషన్ వాలెంటైన్' విడుదలపై ఉంది. ఈ సినిమా కోసం అహర్నిశలు కష్టపడ్డాం. దీని తర్వాత చిన్న బ్రేక్ తీసుకొని ఆగస్టు నుంచి కొత్త ప్రాజెక్ట్స్ పై వర్క్ చేస్తాం. ఇప్పటివరకు స్పోర్ట్స్, ఏరియల్ యాక్షన్ జోనర్స్ లో లార్జర్ సినిమాలు చేశాం. ఇప్పుడు ఒక డిఫరెంట్ లవ్ స్టొరీ చేయాలనే ఆలోచన ఉంది. 

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)