Breaking News

దమ్ముంటే నన్ను, నా సినిమాలను బ్యాన్‌ చేయండి: నాగవంశీ

Published on Tue, 04/01/2025 - 13:14

ఇటీవల విడుదలైన ‘మ్యాడ్‌ స్క్వేర్‌’ (mad square) చిత్రం మంచి టాక్‌తో దూసుకెళ్తోంది. మూడురోజుల్లోనే ఈ మూవీ రూ. 50.2 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ రాబట్టి ఈ మధ్యకాలం అత్యధిక వసూళ్లను రాబట్టిన చిన్న చిత్రంగా రికార్డు సృష్టించింది. బ్రేక్‌ ఈవెన్‌ సాధించడంతో పెంచిన టికెట్ల ధరను సాధారణ స్థాయికి తీసుకువచ్చామని నిర్మాత సూర్యదేవర నాగవంశీ( Suryadevara Naga Vamsi) తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ‘మ్యాడ్‌ స్క్వేర్‌’ సినిమా గురించి నెగెటివ్‌ ప్రచారం చేస్తున్న వారిపై గ్రహం వ్యక్తం చేశాడు. సినిమా హిట్ టాక్ తెచ్చుకున్నప్పుడు దాన్ని ఎందుకు ప్రోత్సహించరని ఆయన ప్రశ్నించారు.

‘సినిమా రిలీజ్‌ తర్వాత రివ్యూలు వచ్చాయి. అప్పుడు ప్రెస్‌ మీట్‌పెట్టాను కానీ నేను ఏమీ మాట్లాడలేదు. ఎందుకంటే వాళ్ల పని వాళ్లు చేశారు అనుకున్నాను. కానీ, సినిమా బాగా ఆడుతున్నప్పటికీ.. ఆ రివ్యూల మీద సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ‘కంటెంట్‌ లేకపోయినా సీక్వెల్‌ కాబట్టి ఆడుతోందని అంటున్నారు. ఈ సినిమ ఎలా ఉన్నా చూడటానికి ఇదేమైనా ‘బాహుబలి2’, ‘పుష్ప2’, ‘కేజీఎఫ్2’ కాదు కదా! సినిమా ఆశించినంత లేకపోయినా చూడటానికి ఇందులో నటించిన వాళ్లేమీ పెద్ద హీరోలు కాదు. 

‘మ్యాడ్ స్క్వేర్‌’ బాగుంది కాబట్టి చూస్తున్నారు. వేరే మూవీలు బాగోలేవని దీన్ని చూడటం లేదు. ఇది అందరూ తెలుసుకోవాలి. కంటెంట్‌ లేదు. సెకండాఫ్‌ పండలేదని అంటున్నారు. నేను థియేటర్‌లో చాలాసార్లు సినిమా చూశా. ప్రేక్షకుల నుంచి స్పందన బాగుంది. జనాలకు తెలిసినంత బాగా రివ్యూవర్‌లకు తెలియడం లేదా?

మీరు (మీడియా) మేమూ కలిసి పనిచేయాలి. నేను సినిమాలు తీసి విడుదల చేస్తేనే మీ వెబ్‌సైట్స్‌ రన్‌ అవుతున్నాయి. నేను ఇంటర్వ్యూలు ఇస్తేనే మీ యూట్యూబ్‌ ఛానళ్లు పనిచేస్తున్నాయి. మేము ప్రకటనలు ఇస్తేనే మీ సైట్స్‌ పనిచేస్తాయి. ద‌మ్ముంటే నా సినిమాలు బ్యాన్ చేసి చూపించండి. నా సినిమా ఆర్టిక‌ల్స్ రాయ‌కండి. నా సినిమాను ఎలా ప్రమోట్‌ చేసుకోవాలో నాకు బాగా తెలుసు.సినిమాలు ఆడితేనే మీరూ ఉంటారు. లేకపోతే ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది. అది గుర్తుపెట్టుకుని ప్రవర్తించండి’ అని నాగవంశీ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)