Breaking News

యానిమల్‌ పోటీ.. అయినా తప్పలేదు: ‘అథర్వ’ నిర్మాత

Published on Tue, 11/28/2023 - 17:16

ప్రతి వారం మూడు, నాలుగు సినిమాలు విడుదల అవుతున్నాయి. డిసెంబర్‌ ఒకటవ తేదిన పాన్‌ ఇండియా మూవీ ‘యానిమల్‌’తో పాటు అథర్వ కూడా రిలీజ్‌ అవుతుంది. మరో వారం నాని సినిమా..ఆ తర్వాత ప్రభాస్‌ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అందుకే డిసెంబర్‌ 1 మా చిత్రానికి సరైన డేట్‌ అనిపించింది, మా చిన్న చిత్రంపై యానిమల్‌ ప్రభావం ఉంటుందని తెలిసినా..రిలీజ్‌ చేయక తప్పట్లేదు’ అని అన్నారు నిర్మాత  సుభాష్ నూతలపాటి. కార్తీక్ రాజు, సిమ్రాన్ చౌదరి, ఐరా  హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘అథర్వ’.  మహేష్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సుభాష్ నూతలపాటి నిర్మించారు.విజయ, ఝాన్సీ ఎగ్జిగూటివ్ ప్రొడ్యూసర్స్‌గా వ్యవహరించారు. డిసెంబర్ 1న ఈ చిత్రం థియేటర్లోకి రాబోతోంది. ఈ నేపథ్యంలో నిర్మాత సుభాష్‌ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..

►ప్రస్తుతం అందరూ థ్రిల్లర్ మూవీస్‌ను ఇష్టపడుతున్నారు. అథర్వలో సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలు చాలా ఉంటాయి. క్లూస్ డిపార్ట్మెంట్ మీద ఇంత వరకు సినిమా రాలేదు. వారు చేసే పనిని ఇందులో మరింత డీటైలింగ్‌గా చూపిస్తాం. ప్రతీ పది నిమిషాలకు ఓ ట్విస్ట్ ఉంటుంది.

►మా డైరెక్టర్ మహేష్ రెడ్డి బ్రదర్ క్లూస్ టీంలో పని చేస్తున్నారు. క్లూస్ టీం వెంకన్న గారితో మా డైరెక్టర్ ఆరు నెలలు కలిసి రీసెర్చ్ చేశారు. ప్రతీ విషయాన్ని ఎంతో క్షుణ్నంగా రీసెర్చ్ చేశారు. క్లూస్ టీంకు ప్రివ్యూ వేస్తే వారంతా చాలా ఎమోషనల్ అయ్యారు.

►ప్రతీ సినిమాకు బడ్జెట్‌ పెరుగుతూనే ఉంటుంది. అయితే సినిమాను మరింత బాగా తీయాలనే ఉద్దేశంతోనే ఖర్చు పెడతాం. ఈ సినిమా కోసం స్పెషల్ సెట్స్ వేశాం. వాటి గురించి ఇప్పుడే చెప్పలేం. సినిమా చూస్తే అందరికీ అర్థం అవుతుంది.

►అథర్వలో ఇద్దరు హీరోయిన్లు ముఖ్యమైన పాత్రల్లో కనిపిస్తారు. కథలో ఇద్దరు హీరోయిన్లకు స్కోప్ ఉండటంతోనే పెట్టాం. ఒకరు క్రైమ్ రిపోర్టర్‌గా నటించారు. ఇంకొకరు సినిమాలో సినిమా హీరోయిన్‌గా నటించారు.

►ప్రతీ వారం ఏదో ఒక సినిమా వస్తూనే ఉంటుంది. తరువాత నాని, ప్రభాస్ గార్ల సినిమాలున్నాయి. ఇలా ఎప్పుడూ ఏదో ఒక సినిమా ఉంటుంది. యానిమల్ ప్రభావం ఉంటుందని తెలిసినా మాకు ఇదే సరైన డేట్ అనిపించింది. 

►అథర్వ చిత్రంలో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. అన్ని రకాల జానర్లు ఇందులో ఉంటాయి. ఒక్కొక్కొరికి ఒక్కో పాయింట్ నచ్చింది. ముఖ్యంగా ట్విస్టులు అందరినీ ఆకట్టుకున్నాయి.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)