VCK నిర్ణయంపై స్టాలిన్ ఆగ్రహం
Breaking News
ఆర్‌బీ చౌదరి మరణం.. ఆయన చివరి ఈవెంట్ ఇదే..!
Published on Wed, 05/06/2026 - 19:36
ప్రముఖ దక్షిణాది నిర్మాత ఆర్‌బీ చౌదరి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఈ దుర్ఘటన జరిగింది. ఆయన మృతితో దక్షిణాది సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు. మెగాస్టార్‌తో పాటు టాలీవుడ్ హీరోలంతా ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. చెన్నైలోని ఆయన నివాసానికి భౌతికకాయాన్ని తరలించగా కోలీవుడ్ స్టార్స్ నివాళులర్పించారు.
ఆర్‌బీ చౌదరి మరణం వేళ ఓ వీడియో వైరల్‌గా మారింది. నిర్మాతగా ఆయన దాదాపు 99 సినిమాలు నిర్మింంచారు. నిర్మాతగా ఆయన హాజరైన చివరి ఈవెంట్ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆయన కుమారుడు జీవా హీరోగా నటించిన తలైవాన్ మూవీ ఈవెంట్‌లో చివరిసారిగా కనిపించారు. ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్‌లో ఆర్‌బీ చౌదరి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జీవా కుమారుడు సైతం కనిపించారు. తన మనవడితో ఆర్‌బీ చౌదరి ఈవెంట్‌లో సందడి చేశారు.
தயாரிப்பாளர் ஆர்.பி.சௌத்ரி இறுதியாக கலந்து கொண்ட நிகழ்வு ( மகன் ஜீவா நடித்த தலைவர் தம்பி தலைமையில் பட வெற்றி விழா). மகன் மற்றும் பேரனுடன் மகிழ்ந்திருந்த தருணம்#RBChoudhary | #Jiiva pic.twitter.com/QFr4BOc50P
— PttvOnlinenews (@PttvNewsX) May 5, 2026
Tags : 1