Breaking News

'కింగ్డమ్‌'కు భారీ నష్టాలు.. నాగవంశీ ఫస్ట్‌ రియాక్షన్‌ ఇదే

Published on Sun, 10/26/2025 - 11:19

విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన స్పై యాక్షన్‌ డ్రామా మూవీ ‘కింగ్డమ్‌’ (Kingdom). ఇందులో హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే నటించగా సత్యదేవ్‌, వెంకటేశ్‌, అయ్యప్ప పి.శర్మ, రాజ్‌కుమార్ కసిరెడ్డి వంటి వారు నటించారు. నిర్మాత నాగవంశీ భారీ బడ్జెట్‌తో నిర్మించిన కింగ్డమ్‌ మూవీ   ఈ ఏడాది జులైలో  విడుదలైన సంగతి తెలిసిందే. అయితే, సినిమాకు నెగటివ్‌ టాక్‌ రావడంతో భారీ నష్టాలు వచ్చాయని అందరూ అనుకున్నారు. ఈ క్రమంలో తాజాగా కింగ్డమ్‌ కలెక్షన్స్‌పై నాగవంశీ రియాక్ట్‌ అయ్యారు.

'అందరూ కింగ్డమ్‌ సినిమా ఫెయిల్యూర్‌ అయిందని అంటున్నారు. అందులో నిజం లేదు. అమెరికాలోనే సుమారు రూ. 28 కోట్లు కలెక్ట్‌ చేసింది. కేవలం నైజాంలోనే రూ. 12 కోట్లకు పైగా కలెక్షన్స్‌ రాబట్టింది. ఇలాంటి సినిమాను ఫెయిల్యూర్‌ అంటే ఎలా..? కింగ్డమ్‌ సినిమాకు అనిరుధ్‌ రవిచంద్రన్‌, గౌతమ్‌ తిన్ననూరి వంటి వారు పనిచేయడంతో సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. దీంతో ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాలను మేము రీచ్‌ కాలేకపోయాం. 

నా నుంచి కింగ్డమ్‌ సినిమాను కొన్న బయ్యర్లు అందరూ సేఫ్‌ జోన్‌లోనే ఉన్నారు. కలెక్షన్స్‌ పరంగా ఒకరో ఇద్దరో నష్టపోయిన బయ్యర్లకు జీఎస్టీ రూపంలో రిటర్న్‌ చేశాను. దీంతో వారు కూడా సేఫ్‌ జోన్‌లోకి వచ్చేశారు. ఈ సినిమాతో నాకు ఎలాంటి నష్టం జరగలేదు. అలాంటప్పుడు కింగ్డమ్‌ ప్లాప్‌ సినిమా ఎలా అవుతుంది..? కానీ, మేము అనుకున్నంత రేంజ్‌లో కింగ్డమ్‌ రన్‌ కాలేదు. బాక్సాఫీస్‌ లెక్కల పరంగా కింగ్డమ్‌ హిట్‌ చిత్రంగానే ఉంటుంది.' అని ఆయన అన్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)