Breaking News

ప్రభుత్వ అవార్డులను స్వీకరించడం మన బాధ్యత: ‘దిల్‌’ రాజు

Published on Mon, 06/16/2025 - 01:58

‘‘ప్రభుత్వ  అవార్డులను స్వీకరించాలి. షూటింగుల్లో బిజీగా ఉన్నా, ఎక్కడ ఉన్నా, ప్రభుత్వం నుంచి అవార్డు వస్తుందంటే స్వీకరించడం మన బాధ్యత. ప్రభుత్వంతో జర్నీ చేయాల్సిన బాధ్యత సినిమా ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరిదీ. భవిష్యత్తులో కూడా ప్రభుత్వం నుంచి అవార్డులు ప్రకటించినప్పుడు ఆ తేదీలను డైరీలో నోట్‌ చేసుకుని, ఒకవేళ మీకు అవార్డు ఉంటే ఆ అవార్డును స్వీకరించాలి. ఇది నా రిక్వెస్ట్‌. అది ఏ రాష్ట్రమైనా కానివ్వండి. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్‌లో కూడా అవార్డులు స్టార్ట్‌ అవుతాయి. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలు మనకు రెండు కళ్లు’’ అని అన్నారు.

 తెలంగాణ ఎఫ్‌డీసీ చైర్మన్, నిర్మాత ‘దిల్‌’ రాజు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన తెలంగాణ గద్దర్‌ అవార్డుల ప్రదానోత్సవం శనివారం హైదరాబాద్‌లో జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ ‘దిల్‌’ రాజు, ఎఫ్‌డీసీ ఎండీ హరీష్‌ ఐఏఎస్‌ ఆదివారం హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. ఈ ప్రెస్‌మీట్‌లో ‘దిల్‌’ రాజు మాట్లాడుతూ– ‘‘తెలం గాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుక సక్సెస్‌ కావడం సంతోషంగా ఉంది. అవార్డులు స్వీకరించిన అందరికీ ఎఫ్‌డీసీ తరఫున ధన్యవాదాలు చెబుతున్నాం. తెలంగాణ సీయం రేవంత్‌రెడ్డిగారికి స్పెషల్‌ థ్యాంక్స్‌.

సినిమాటోగ్రఫీ మినిస్టర్‌ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, డిప్యూటీ సీయం మల్లు భట్టి విక్రమార్కగారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఇంత పెద్ద ఈవెంట్‌లో చిన్న చిన్న తప్పులు ఉండొచ్చేమో. కమ్యూనికేషన్‌ గ్యాప్‌ వల్ల ఏమైనా తప్పులు జరిగి, ఈవెంట్‌కు వచ్చినవారు ఒకవేళ హర్ట్‌ అయితే ఎఫ్‌డీసీ తరఫున చైర్మన్‌గా క్షమాపణలు కోరుతున్నాను’’ అని అన్నారు. ‘‘సీయం రేవంత్‌ రెడ్డిగారి ఆదేశాలతో, సినిమాటోగ్రఫీ మినిస్టర్‌ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డిగారి గైడెన్స్‌తో, ఎఫ్‌డీసీ చైర్మన్‌ ‘దిల్‌’ రాజుగారి విజన్‌తో తెలంగాణ గద్దర్‌ అవార్డ్స్‌ వేడుకను సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించుకున్నాం. ఈ సక్సెస్‌కు కారణమైన ప్రతి ఒక్కరీ కృతజ్ఞతలు’’ అన్నారు ఎఫ్‌డీసీ ఎండీ హరీష్‌.

#

Tags : 1

Videos

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Kurnool: YSRCP మహిళలపై TDP మహిళలు దాడి

ఖాకీ చొక్కాల మాటున టీడీపీ గూండాలు.. ఎన్నికలు జరిగితే 100% YSRCPదే గెలుపు..

70MMలో చంద్రముఖి బాబు నిజస్వరూపం

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)