Breaking News

జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ వివాదం.. అంతా మోహన్ లాల్ సినిమా వల్లే!

Published on Mon, 07/07/2025 - 18:07

అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం జానకి వర్సెస్ స్టేర్ ఆఫ్ కేరళ. ఈ మూవీ రిలీజ్‌కు ముందే చిక్కుల్లో పడింది. దీనికి ప్రధాన కారణం ఆ మూవీ టైటిల్. సినిమా టైటిల్‌లో జానకి పేరు ఉపయోగించడంతో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. సీతాదేవికి మరో పేరైన జానకి టైటిల్ మారిస్తేనే సెన్సార్ చేస్తామని నిర్మాతలకు సూచించింది. దీంతో ఈ పంచాయతీ కాస్తా కోర్టుకు చేరింది.

అయితే ఈ వివాదంపై నిర్మాత సురేశ్‌ కుమార్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది విడుదలైన మోహన్‌ లాల్ చిత్రం ఎంపురాన్-2 పేరును ప్రస్తావించారు. ఆ సినిమా వల్లే ఈ పరిస్థితులు ఎదురయ్యాయని ఆరోపించారు. ఎంపురాన్ మూవీ విడుదల తర్వాత వివాదం తలెత్తడంతో సెన్సార్ బోర్డ్ మరోసారి సెన్సార్ చేయాల్సి వచ్చిందన్నారు. అందుకే సెన్సార్ బోర్డు మరింత జాగ్రత్తగా వ్యవహరించిందని.. ఈ సమస్య అంతా ఆ సినిమాతోనే ప్రారంభమైందని ఆయన అన్నారు. ప్రస్తుతం ఈ వివాదం కోర్టులో ఉన్నందున మాకు అనుకూలంగానే తీర్పు వస్తుందని భావిస్తున్నట్లు నిర్మాత జి సురేశ్ కుమార్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా.. పృథ్వీరాద్ సుకుమారన్ డైరెక్షన్‌లో వచ్చిన ఎంపురాన్-2 బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)