Breaking News

కష్టంగానే ఆ పాటకు ఓకే చెప్పా.. ప్రియాంక చోప్రా

Published on Fri, 08/01/2025 - 14:44

‘రామ్‌-లీలా’ సినిమాలో ప్రియాంక చోప్రా ఓ స్పెషల్‌ సాంగ్‌ చేసిన సంగతి తెలిసిందే. ‘రామ్ చాహే లీలా’ అంటూ సాగే ఆ పాట అప్పట్లో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. సినిమా విజయంలో ఈ పాట కీలక పాత్ర పోషించింది. తాజాగా ఈ పాటకు సంబంధించిన ఓ క్లిప్‌ని షేర్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ.. అప్పటి జ్ఞాపకాలను పంచుకుంది.

‘ఈ ప్రత్యేక పాట కోసం దర్శకుడు సంజయ్‌ లీలా నన్ను సంప్రదించినప్పుడు ‘నేను చేయగలనా’ అనుకున్నాను. కష్టంగానే ఆ పాటకు ఓకే చెప్పాను. సెట్‌లో దర్శకుడు నాకు బాగా ధైర్యం చెప్పాడు. పాటలోని ప్రతి పదానికి అర్థం వివరిస్తూ..హావభావాల దగ్గర నుంచి డ్యాన్స్ మూమెంట్స్‌ వరకూ సలహాలిచ్చారు. కొరియోగ్రాఫర్‌ అద్భుతంగా కంపోజ్‌ చేశాడు. లంచ్‌ బ్రేక్‌ టైంలో కూడా డ్యాన్స్‌ మూమెంట్స్‌ గురించి వివరించేవాడు. కష్టంగా ఒకే చెప్పినా..నాకు మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది. ఈ జ్ఞాపకాలన్నీ ఎప్పటికీ గుర్తుంటాయి’ అని ప్రియాంక ఇన్‌స్టాలో రాసుకొచ్చింది.

రామ్‌-లీలా సినిమా విషయానికొస్తే.. 2013లో విడుదలైన ఈ సినిమా అప్పట్లోనే 200 కోట్లకు పైగా వసూళ్లను సాధించి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. రణ్‌వీర్‌-దీపికా పదుకొణె జంటగా నటించిన ఈ చిత్రానికి సంజయ్‌ లీలా భన్సాలీ దర్వకత్వం వహించాడు. గ్యాంగ్‌స్టర్‌ కుటుంబాలకు చెందిన ఇద్దరు ప్రేమికుల చుట్టు తిరిగే కథ ఇది. 
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)