Breaking News

నేను కాస్ట్‌ ఫెయిల్యూర్‌ హీరోని కాదు: ప్రియదర్శి

Published on Fri, 11/21/2025 - 01:35

‘‘సినిమాల్లో నేను పోషించేపాత్రలపై నా వ్యక్తిత్వ ప్రభావం ఉండదు. నేననేవాడిని లేకుండా సినిమాల్లో నేను పోషించే పాత్రల్లోకి నటుడిగా నేను ఎంటర్‌ కావాలి. నన్ను నేను వెనక్కి పెట్టుకుంటేనే ప్రయోగాత్మక చిత్రాలు, కొత్త తరహాపాత్రలు చేయగలను. ‘మల్లేశం, బలగం, కోర్టు’ వంటి చిత్రాలు ఇలా వచ్చినవే. ఎవరైనా మీ స్టైల్లో ఒక సినిమా చేద్దామంటే నాకేం స్టైల్‌ లేదు. మీరేదైనా కొత్తగా చెప్తే అదే నా స్టైల్‌ అవుతుందని చెప్తుంటాను’’ అని ప్రియదర్శి అన్నారు.

ప్రియదర్శి, ఆనంది హీరో హీరోయిన్లుగా, సుమ కనకాల ముఖ్యపాత్రలో నటించిన సినిమా ‘ప్రేమంటే..’. నవనీత్‌ శ్రీరామ్‌ దర్శకత్వంలో రానా స్పిరిట్‌ మీడియా సమర్పణలో పుస్కూర్‌ రామ్మోహన్‌ రావు, జాన్వీ నారంగ్‌ నిర్మించారు. ఈ చిత్రం నేడు (శుక్రవారం) విడుదల కానుంది. ఈ సందర్భంగా గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ప్రియదర్శి చెప్పిన విశేషాలు... 

ప్రతి సినిమా రిలీజ్‌కి ముందు ఉండే టెన్షనే నాకు ఈ సినిమాకి కూడా ఉంది. ఒక రైతు వాన కోసం ఎదురు చూసినట్లు నేను కూడా  సినిమా రిజల్ట్‌ కోసం ఎదురు చూస్తుంటాను (నవ్వుతూ...). మనం ఇష్టపడి పెళ్లి చేసుకున్న తర్వాత మొదలయ్యే జీవితంలో చాలా డైనమిక్స్‌ మారతాయి. ప్రేమంటే ఇంత బాగుంటుంది అని అనుకోవడం దగ్గర్నుంచి ఇలా కూడా ఉండొచ్చని మా సినిమాలో చూపించే ప్రయత్నం చేశాం.  పెళ్లి నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. కానీ మనం ఎప్పుడు, ఏ విధంగా, ఏ టైమ్‌లైన్‌లో చె΄్పాం అన్నది ముఖ్యం. ‘ప్రేమంటే..’ని అందరూ రిలేట్‌ చేసుకుంటారు.

ఈ సినిమాలో నా క్యారెక్టర్‌ కాస్త కొత్తగా ఉంటుంది. ఆనంది మంచి పెర్ఫార్మర్‌. చాలా ప్రోఫెషనల్‌. సుమక్క నుంచి చాలా నేర్చుకున్నాను. నవనీత్‌ మంచి క్లారిటీ ఉన్న డైరెక్టర్‌. పెళ్లిపై మెచ్యూరిటీతో ఈ కథ రాశాడు. సునీల్‌ నారంగ్, రామ్మోహన్‌రావు, జాన్వీగార్లు మంచిగా సపోర్ట్‌ చేశారు. ∙నేను విలక్షణమైన కథలు చేస్తాననే గుర్తింపును ప్రేక్షకులు ఇచ్చారు. ఈ బాధ్యతతో సినిమాలు చేస్తున్నాను. అలాగే నాతో సినిమాలు చేసే నిర్మాతలు నష్టపోకూడదనుకుంటాను. ‘డార్లింగ్‌’ సినిమా ప్రాఫిటబుల్‌ వెంచర్‌. ‘సారంగపాణి, డార్లింగ్, మిత్రమండలి’ సినిమాలు థియేటర్స్‌లో ఆడకపోవడానికి చాలా కారణాలు ఉండొచ్చు. కానీ... ఇప్పటి వరకు నేను కాస్ట్‌ ఫెయిల్యూర్‌ హీరోని అయితే కాదు. ప్రస్తుతం ‘అసమర్థుడు’, ‘సుయోధన’ అనే సినిమాలు చేస్తున్నాను.

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)