Breaking News

సలార్ హీరోకు అరుదైన గౌరవం.. సీఎం చేతుల మీదుగా అవార్డ్

Published on Thu, 04/17/2025 - 16:49

సలార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన బ్లాక్ బస్టర్‌ హిట్ 'ఆడుజీవితం (ది గోట్ లైఫ్‌). గతేడాది ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఉపాధి కోసం అరబ్‌ దేశాలకు వెళ్లిన వారి నిజ జీవితాల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. దర్శకుడు బ్లెస్సీ ఎంతో అద్భుతంగా ఈ మూవీని తెరకెక్కించాడు.

అయితే తాజాగా ఈ సినిమా కేరళ రాష్ట్ర అవార్డుల్లో సత్తాచాటింది. ఈ సినిమాలో నటనకు గానూ పృథ్వీరాజ్ సుకుమారన్‌కు బెస్ట్‌ యాక్టర్‌ అవార్డ్ వరించింది. అంతే కాకుండా ఈ చిత్రం ఏకంగా తొమ్మిది విభాగాల్లో అవార్డులు సొంతం చేసుకుని సత్తా చాటింది. కేరళ సీఎం పినరయి విజయన్ చేతుల మీదుగా ఆయన ‍అవార్డ్ అందుకున్నారు. తిరువనంతపురం వేదికగా 54వ కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డుల వేడుక గ్రాండ్‌గా జరిగింది.

కాగా.. పృథ్వీరాజ్ తండ్రి, లెజెండరీ సుకుమారన్ ఉత్తమ నటుడిగా కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డు అందుకున్న మొదటి వ్యక్తి కావడం మరో విశేషం. ఆ తర్వాత ఈ టైటిల్‌ను మోహన్‌లాల్ సొంతం చేసుకున్నారు. అంతకుముందే 2006లో పృథ్వీరాజ్ కేవలం 24 సంవత్సరాల వయసులో వాస్తవమ్ చిత్రంలో నటనకు ఈ అవార్డును అందుకున్నారు. ఈ ఘనత సొంతం చేసుకున్న అతి పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. దాదాపు ఇరవై సంవత్సరాల మరోసారి ఆయనను అవార్డ్ వరించింది.

Videos

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి