Breaking News

లూసీఫర్‌ 2 తెలుగు వెర్షనే చూడండి : పృథీరాజ్‌ సుకుమార్‌

Published on Sat, 03/22/2025 - 14:16

మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్(Mohanlal), పృథ్వీరాజ్ సుకుమార్(Prithviraj Sukumaran) కాంబోలో తెర‌కెక్కిన భారీ చిత్రం ‘లూసిఫర్‌2: ఎంపురాన్‌’. ఈ చిత్రాన్ని  ఆశీర్వాద్ సినిమాస్, శ్రీ గోకులం మూవీస్ బ్యానర్లపై ఆంటోనీ పెరుంబవూర్, గోకులం గోపాలన్ నిర్మించారు. ముర‌ళీ గోపి క‌థ‌ను అందించారు. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా మార్చి 27న మలయాళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ అవుతుంది. తెలుగులో ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాడు. 

ఈ క్రమంలో శనివారం చిత్రబృందం ప్రీరిలీజ్‌ ప్రెస్‌మీట్‌ నిర్వహించింది. ఈ సందర్భంగా పృథ్విరాజ్‌ సినిమా గురించి మాట్లాడుతూ.. తెలుగులోనే ఈ చిత్రాన్ని చూడాలని కోరాడు. ‘మాములుగా ఏ డెరెక్టర్‌ అయినా కూడా తన సినిమాను ఒరిజినల్ వెర్షన్ చూడమని చెపుతారు. నేను మాత్రం లూసీఫర్ 2 తెలుగు వెర్షన్ చూడమని సలహా ఇస్తున్నాను. 

తెలుగు మాట్లాడే ప్రతి ఒక్కరు ఈ చిత్రాన్ని తెలుగులోనే చూడండి. ఒరిజినల్‌ వెర్షన్‌ చూసిన ఫీలింగే కలుగుతుంది. డబ్బింగ్‌ విషయంలో టీమ్‌ బాగా కష్టపడి మంచి ఔట్‌పుట్‌ ఇచ్చింది. దిల్‌ రాజుగారు తెలుగు రాష్ట్రాల్లో మలయాళ వెర్షన్‌ కూడా రిలీజ్‌ చేస్తున్నారు కానీ.. నేను మాత్రం తెలుగులోనే చూడమని కోరుతున్నాను’ అన్నారు. మోహన్‌ లాల్‌ మాట్లాడుతూ.. ‘టాలీవుడ్‌ ప్రపంచంలోనే నెంబర్‌ వన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీ. తెలుగులో సినిమా చేయాలని నేను కూడా ఎదురుచూన్నాను. మంచి కథ వస్తే కచ్చితంగా చేస్తాను. ఇప్పుడు ఏ సినిమా ఫైనల్‌ కాలేదు.అయితే కచ్చితంగా చెబుతాను’ అన్నారు. 

Videos

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)