Breaking News

'వారణాసి' విలన్ మరో తెలుగు సినిమా?

Published on Wed, 12/31/2025 - 19:56

పృథ్వీరాజ్ సుకుమారన్ అన్ని భాషల్లో సినిమాలు చేస్తుంటాడు. స్వతహాగా మలయాళీ అయినప్పటికీ హిందీ, తెలుగులోనూ నటిస్తున్నాడు. పాన్ ఇండియా స్థాయిలోనూ అడపాదడపా కనిపిస్తూనే ఉంటాడు. గతంలో ప్రభాస్‌ 'సలార్'లో విలన్ తరహా పాత్రలో కనిపించాడు. క్రేజ్ సొంతం చేసుకున్నాడు. మహేశ్-రాజమౌళి 'వారణాసి'లోనూ విలన్ ఇతడే. కొన్నిరోజుల క్రితం జరిగిన ఈవెంట్‌లో అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించారు. ఇప్పుడు మరో తెలుగు మూవీలోనూ విలన్‌గా చేసేందుకు సిద్ధమయ్యాడట.

'ప్యారడైజ్'తో బిజీగా ఉన్న నాని.. దీన్ని మార్చి 26న థియేటర్లలో రిలీజ్ చేస్తున్నాడు. కొన్నిరోజుల క్రితం రూమర్స్ వచ్చాయి గానీ తాజాగా వదిలిన అప్డేట్స్ మాత్రం చెప్పిన తేదీన రావడం పక్కా అని క్లారిటీ ఇచ్చాయి. దీని తర్వాత 'ఓజీ'తో హిట్ కొట్టిన సుజీత్ దర్శకత్వంలో నాని నటించబోతున్నాడు. చాన్నాళ్ల క్రితం దీని గురించి అనౌన్స్‌మెంట్ వచ్చింది. వచ్చే వేసవి నుంచి ఈ ప్రాజెక్ట్ మొదలు కానుంది.

ఈ సినిమా కోసం ఇప్పటినుంచే అన్ని రెడీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పృథ్వీరాజ్ సుకుమారన్‌ని నాని-సుజీత్ మూవీలో ఓ కీలక పాత్ర కోసం అనుకుంటున్నట్లు ఇప్పుడు వార్తలొస్తున్నాయి. ఒకవేళ ఇది నిజమై పృథ్వీరాజ్ పాత్ర హిట్ అయితే గనక.. ఇతడు తెలుగు స్థిరపడిపోవడం గ్యారంటీ. ఇప్పటికే ధనుష్, దుల్కర్ సల్మాన్ లాంటి స్టార్స్ టాలీవుడ్‌లో హీరోలుగా మెల్లగా సెటిలైపోతున్నారు. చూస్తుంటే పృథ్వీరాజ్ కూడా మెల్లగా తెలుగులో జెండా పాతేలా కనిపిస్తున్నాడు

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)