Breaking News

'సలార్' విలన్ కి కారు ఈఎంఐ కష్టాలు

Published on Mon, 03/24/2025 - 16:08

సాధారణంగా సినిమా సెలబ్రిటీలు అనగానే కోట్ల రూపాయల రెమ్యునరేషన్, లగ్జరీ లైఫ్.. ఇవే మన కళ్ల ముందు కనిపిస్తాయి. కానీ తాను కూడా కారుకి ఈఎంఐ కడుతున్నానని సలార్ ఫేమ్ పృథ్వీరాజ్ సుకుమారన్ చెప్పుకొచ్చాడు. ఎల్ 2 ఎంపూరన్ మూవీ ప్రెస్ మీట్ లో ఈ కామెంట్స్ చేశాడు. అలానే డైరెక్షన్ అనేది తన తెలివి తక్కువ నిర్ణయమని చెప్పుకొచ్చాడు.

(ఇదీ చదవండి: బాలీవుడ్ నిర్మాతల పరువు తీసేసిన హిందీ స్టార్ హీరో)

'నాకు డబ్బు సమస్యలు ఉ‍న్నాయి. ఇప్పటికీ కారు ఈఎంఐ కడుతున్నాను. దర్శకత్వం చేయడం ఆర్థికంగా నేను తీసుకున్న తెలివి తక్కువ నిర్ణయం. ఎందుకంటే ‘ఎల్-2: ఎంపురాన్’ కోసం రెండేళ్లు అ‍యిపోయింది. ఆ టైంలో నటుడిగా ఎన్నో సినిమాలు పక్కనబెట్టేశా. అవి చేసుంటే బోలెడు డబ్బులు సంపాదించేవాడిని. అలా అని ఎప్పుడూ డబ్బు కోసం సినిమాలు చేయలేదు. కానీ యాడ్స్ మాత్రం చేశాను. రెండు గంటల యాడ్ షూటింగ్ లో పాల్గొంటే చాలా డబ్బులిచ్చేవారు. కానీ నేను ప్రమోట్ చేసే ఉత్పత్తుల విషయంలో మాత్రం ఎప్పుడూ జాగ్రత్తగా ఉండేవాడిని' అని పృథ్వీరాజ్ చెప్పుకొచ్చాడు.

మోహన్ లాల్ ని హీరోగా పెట్టి ‘ఎల్-2: ఎంపురాన్’ సినిమా తీసిన పృథ్వీరాజ్.. గతంలో సలార్ మూవీలో చేశాడు. ప్రస్తుతం రాజమౌళి-మహేశ్ బాబు ప్రాజెక్ట్ లో కీలక పాత్రలో నటిస్తున్నాడు. మరిన్ని సినిమాలు చేసేందుకు ఇతడికి ఆఫర్స్ వస్తున్నాయి. కొన్నాళ్ల క్రితం లాంబోర్గిని అనే ఖరీదైన కారు కొన్నాడు. దానికే ఈఎంఐ కడుతున్నానని ఇప్పుడు చెప్పాడు.

(ఇదీ చదవండి: 'కన్నప్ప' మూవీని ట్రోల్ చేస్తే శాపానికి గురవుతారు: రఘుబాబు)

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)