Breaking News

లవ్, రిలేషన్ షిప్, గొడవలు..ఆసక్తికరంగా ‘ప్రేమిస్తావా’ ట్రైలర్‌

Published on Tue, 01/28/2025 - 19:23

ఆకాష్ మురళి, అదితి శంకర్ జంటగా ‘పంజా’ఫేం విష్ణు వర్ధన్ తెరకెక్కించిన రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘ప్రేమిస్తావా’. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా తమిళంలో ‘నేసిప్పాయా’ పేరుతో విడుదలై మంచి విజయం సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో మైత్రీమూవీ మేకర్స్ ఈ సినిమాను తెలుగులో విడుదల చేసేందుకు ముందుకొచ్చింది. జనవరి 30న ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తోంది మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్. ఈ నేపథ్యంలో తెలుగు ట్రైలర్ లాంచ్ వేడుకను మంగళవారం ప్రసాద్ ల్యాబ్‌లో ఘనంగా నిర్వహించారు మేకర్స్.

ట్రైలర్ విషయానికి వస్తే ప్రేమజంట మధ్య లవ్, రిలేషన్ షిప్, గొడవలు ఇలా ఎంతో ఆసక్తికరంగా ట్రైలర్‌ను డిజైన్ చేశారు. ఇప్పటి వరకు వచ్చిన లవ్ స్టోరీస్‌కు డిఫరెంట్‌గా ఈ సినిమా ఉందని చెప్పేలా ట్రైలర్ ఉంది. ఆకాష్ మురళి ఎంతో అనుభవం ఉన్న నటుడిగా తొలి సినిమాతోనే అదరగొట్టాడని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఇక అదితి శంకర్ విషయానికి ప్రేమికురాలిగా తనలోని కొత్త కోణాన్ని చూపించారు. శరత్ కుమార్, ఖుష్బూ ఎమోషనల్ సీన్స్ కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. మొత్తంగా సినిమాపై అంచనాలు పెంచేలా ట్రైలర్‌ను కట్ చేశారని తెలుస్తోంది.

ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో డైరెక్టర్ విష్ణు వర్ధన్ మాట్లాడుతూ..‘‘ఏడెనిమిదేళ్ల తర్వాత తెలుగువారిని కలుస్తున్నా. నేను తెలుగులో మాట్లాడితే మా అమ్మ సంతోషపడుతుంది. మా సినిమాను సపోర్ట్ చేసి రిలీజ్ చేస్తున్నందుకు మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్‌కు చాలా థ్యాంక్స్. ఈ సినిమా ఆకాష్-అదితి మధ్య ప్రేమ గురించి చెబుతుంది. ప్రస్తుతం సమాజంలో రిలేషన్ షిప్స్ ఎలా ఉన్నాయి అనేది చూపిస్తుంది. అదితి, ఆకాష్ చాలా చక్కగా నటించారు. కొన్ని సీన్స్‌లో వాళ్ల నటన చూసి ఎమోషనల్ అయ్యాను. 

లవ్ స్టోరీలో సాలిడ్ డ్రామా అనేది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఆ డ్రామాని సపోర్ట్ చేస్తూ మిగతా క్యారెక్టర్స్ చేసిన శరత్ కుమార్, ఖుష్బూ, ప్రభుగారికి థ్యాంక్స్ చెప్పాలి. ఇలాంటి స్క్రిప్ట్‌ను నిర్మాతలు ఒప్పుకోవడం సాహసమనే చెప్పాలి. యువన్ శంకర్ రాజా నా స్కూల్ మేట్. అప్పటి నుంచి అతని సంగీతం తెలుసు. నా సినిమాలన్నింటికీ ఆయనే సంగీతం చేస్తారు. యువన్ సంగీతం కోసమే సినిమాకు వచ్చే ప్రేక్షకులు చాలామంది ఉన్నారు. ఈ సినిమా కోసం ఎంతోమంది గొప్ప టెక్నీషియన్స్ పని చేశారు. ఎప్పటిలాగే మీ అందరి సపోర్ట్ నాకు, ఈ సినిమాకు ఇవ్వాలని కోరుకుంటున్నా. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గారు ఇప్పటికీ అంతే ఎనర్జీతో ఉన్నారు. ఆయన చాలా ఎత్తుకు ఎదుగుతారని పంజా సినిమా టైమ్‌లోనే నాకు అర్థమైంది. ఆయన మనసు నిజంగా చాలా మంచిది. ఆప్పుడు ఆయన డిప్యూటీ సీఎం అవడం చూస్తుంటే చాలా గర్వంగా ఉంది’’ అని చెప్పారు.

హీరో ఆకాష్ మురళి మాట్లాడుతూ..‘‘నా ఫస్ట్ సినిమాను తెలుగులో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేయడం నిజంగా నా అదృష్టం. ప్రేమిస్తావా సినిమాకు అందరి సపోర్ట్ కావాలి. అదితి నిజంగా బెస్ట్ కోస్టార్. డైరెక్టర్ హర్ష వర్ధన్ గారు ఈ సినిమాను చాలా బాగా తీశారు. అందరూ తప్పకుండా ప్రేమిస్తావా సినిమాను చూడండి’’ అని చెప్పారు.

హీరోయిన్ అదితి శంకర్ మాట్లాడుతూ..‘‘ప్రేమిస్తావా సినిమాను మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది నా ఫస్ట్ లవ్ స్టోరీ. ఇందులో లవ్ ఉంది.. యాక్షన్ ఉంది.. రొమాన్స్ ఉంది.. డైరెక్టర్ విష్ణు వర్ధన్ గారి స్టైలిష్ మేకింగ్ ఉంది. ఈ సినిమాను అందరూ తప్పకుండా చూడండి. మా నాన్నగారికి ఇస్తున్న ప్రేమను నాకు కూడా ఇవ్వాలని కోరుకుంటున్నా’’ అని తెలిపారు.

Videos

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)