Breaking News

తెలుగు తెరపై మరో బోల్డ్‌ ‘ప్రేమికుడు’

Published on Tue, 12/24/2024 - 16:01

అర్జున్‌ రెడ్డి సినిమా తర్వాత టాలీవుడ్‌లో బోల్డ్‌ ప్రేమ కథలు ఎక్కువగా వస్తున్నాయి. హీరో పాత్రను బోల్డ్‌గా చూపిస్తూనే ఓ మంచి ప్రేమ కథను ప్రేక్షకులకు చూపిస్తున్నారు. ఆడియన్స్‌ కూడా అలాంటి కథలనే ఆదరిస్తున్నారు. అందుకే ఈ మధ్యకాలంలో రా అండ్‌ బోల్డ్‌ రొమాంటిక్‌ స్టోరీస్‌ ఎక్కువగా వస్తున్నాయి. యువతను టార్గెట్‌ చేసుకొని.. నేటి తరానికి, ట్రెండ్ కి తగ్గట్టుగా సినిమాలను తెరకెక్కిస్తున్నారు. 

(చదవండి: తగ్గేదేలే అంటోన్న పుష్పరాజ్.. ఆ భాషలో బాక్సాఫీస్ షేక్‌!)

తాజాగా మరో బోల్డ్‌ లవ్‌స్టోరీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అదే ‘ప్రేమికుడు’(Premikudu).  రామ్ వెలుగు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పండు చిరుమామిళ్ల ప్రధాన పాత్రలో నటించారు. గురుదేవ్ స్టోరీ టెల్లర్స్ బ్యానర్‌పై రామ్ యాదవ్ గొట్టె, చెరుకూరి సాయి కుమార్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్, ఫస్ట్-లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. 

ఇందులో పండు చిరుమామిళ్ల(Pandu Chirumamilla) బోల్డ్ అండ్ ఇంటెన్స్ పాత్రను పోషించినట్టుగా ఫస్ట్‌లుక్‌ చూస్తే అర్థమవుతుంది. "అన్‌ఫిల్టర్డ్" అనే ట్యాగ్‌లైన్ తో ఈ సినిమా ఎలా ఉండబోతోందో అర్థం చేసుకోవచ్చు. పోస్టర్‌లో హీరో నేలపై నగ్నంగా పడుకుని ఉండటం, ఆ సిగరెట్, చేతికి సంకెళ్ళు, శరీరంపై రక్తపు మరకలు చూస్తోంటే అందరినీ మెస్మరైజ్ చేసేట్టుగా ఉన్నాయి.ఈ మూవీకి ఆదిత్య లొల్ల సినిమాటోగ్రాఫర్ కాగా, చీదెళ్ల నాగార్జున రచయితగా పని చేస్తున్నారు. ఇతర వివరాలను మేకర్స్ త్వరలోనే ప్రకటించనున్నారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)