Breaking News

'ప్రేమకు జై' రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

Published on Thu, 04/10/2025 - 14:44

వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కే సినిమాలపై ప్రేక్షకులకు ఎప్పుడూ క్యూరియాసిటీ ఉంటుంది. అలా ఓ గ్రామీణ నేపథ్యంలో యాదార్థ సంఘటనల ఆధారంగా తెర‌కెక్కిన మూవీ 'ప్రేమ‌కు జై'. అనిల్ బురగాని, జ్వలిత జంటగా, శ్రీనివాస్ మల్లం దర్శకత్వంలో అనసూర్య నిర్మించిన ఈ సినిమా ఈ నెల (ఏప్రిల్) 11న  థియేట‌ర్‌ల‌లో విడుద‌ల అవుతోంది. ఈ వైవిద్యమైన ప్రేమ కథ చిత్రం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్ప‌టి వ‌ర‌కు తెర‌పై చూడ‌ని ఓ ల‌వ్‌స్టోరీని చూపించ‌బోతున్న‌ట్టు చిత్ర‌యూనిట్ ప్ర‌క‌టించింది. ప్ర‌చార చిత్రాలు ఇప్ప‌టికే వైర‌ల్‌గా మారాయి.

ఈ సంద‌ర్భంగా 'ప్రేమకు జై' దర్శకుడు మల్లం శ్రీనివాస్ మాట్లాడుతూ... ''పల్లెటూరి నేపథ్యంలో వాస్తవంగా జరిగిన ఓ సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించాం. మా హీరో హీరోయిన్లు అనిల్ బురగాని, జ్వలిత బాగా చేశారు. మా టీం అందరి కృషి వల్ల ఈ సినిమా ఇంత బాగా వచ్చింది. క్వాలిటీ విషయంలో నిర్మాత రాజీ పడలేదు. ఎంతో సహకరించారు. శుక్ర‌వారం థియేట‌ర్‌ల‌లో విడుద‌ల‌య్యే ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాం'' అని అన్నారు.
 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)