Breaking News

వాళ్లు ఎన్నో మాటలన్నారు.. ఆ డబ్బుతోనే కుటుంబాన్ని పోషించా: అబ్బాస్‌

Published on Sat, 08/05/2023 - 08:59

ఒకప్పుడు హీరోగా, విలన్‌గా ప్రేక్షకులను అలరించిన నటుడు అబ్బాస్ కొన్నేళ్లుగా సినిమాల్లో కనిపించడం లేదు. చెప్పాలంటే అతడు కనుమరుగై దాదాపు పదేళ్లు అవుతుంది. పశ్చిమ బెంగాల్లోని హౌరాలో పుట్టిన అబ్బాస్‌ తెలుగు, హిందీ, తమిళ సినిమాల్లో నటించి స్టార్‌ నటుడిగా మారాడు. తొంభైవ దశకంలో వచ్చిన అద్బుతమైన ప్రేమ కథ చిత్రం ‘ప్రేమ దేశం’తో నటుడిగా పరిచయయ్యాడు.

పరిశ్రమలో అడుగు పెట్టిన అనతి కాలంలోనే దాదాపు 50కి పైగా చిత్రాల్లో నటించాడు. కానీ 2015 తర్వాత, అతను అకస్మాత్తుగా నటనకు స్వస్తి చెప్పి, తన కుటుంబంతో కలిసి న్యూజిలాండ్‌కు వెళ్లాడు. ఆయన రీ ఎంట్రీ ప్లాన్‌ చేస్తున్నాడు. అందుకోసం ఇండియాలోనే ఉండనున్నాడు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పలు విషయాలను షేర్‌ చేసుకున్నాడు

ఎంతో మంది అవమానించారు
'నేను టాయిలెట్‌ క్లీనర్‌ను తాగమని ఆడగలేదు. బాత్రూంలో వాడండి అని చెప్పాను. టాయిలెట్‌ క్లీనర్‌ యాడ్‌లో నటించడం వల్ల నన్ను ఎంతోమంది ట్రోల్‌ చేశారు. నన్ను వెక్కిరిస్తూ చాలామంది కొన్ని వీడియోలు క్రియేట్‌ చేశారు. వాటి వల్ల నేను ఏమాత్రం  ఇబ్బంది పడలేదు. అలాగని వాళ్లు చేస్తున్న విమర్శలకు బాధపడలేదు. పరిశుభ్రత విషయంలో అవగాహన కల్పించడం కోసమే నేను ఆ ప్రకటనలో నటించా.  మీ ఇంటిని క్లీన్‌గా ఉంచడం, ఉంచకపోవడం మీ ఇష్టం.

(ఇదీ చదవండి: అందానికి, అశ్లీలతకు చాలా తేడా ఉంది: హీరోయిన్‌)

ఆ యాడ్‌ చేస్తున్న సమయంలో నాకు అంత బిజీ పనులు ఏమీ లేవు. అందులో పనిచేసినందుకు వాళ్లు నాకు మంచి పారితోషికం ఇచ్చారు కూడా. మా మధ్య దాదాపు ఎనిమిదేళ్లు కాంట్రాక్ట్‌ కుదిరింది. అలా, వచ్చిన డబ్బుతో ఆ సమయంలో కుటుంబాన్ని పోషించా. కాబట్టి అందులో తప్పేముంది. నేను వృత్తులన్నింటినీ ఒకేలా చూస్తా. ప్రతి ఒక్కరూ తమ కుటుంబం కోసమే కష్టపడుతుంటారు' అని ఆయన తెలిపారు.

రీ ఎంట్రీ ప్లాన్‌ 
న్యూజిలాండ్‌లో మధ్యతరగతి జీవితాన్ని గడపిన ఆబ్బాస్‌ మళ్లీ చెన్నై వచ్చాడు. ఇప్పుడు, నటన నుంచి తొమ్మిదేళ్ల విరామం తర్వాత, మళ్లీ నటించడానికి సిద్ధంగా ఉన్నాడు. అతను చివరిసారిగా మలయాళ చిత్రం పచ్చకల్లం (2015)లో కనిపించాడు. తమిళంలో, అతను చివరిగా రామానుజన్ బయోపిక్‌లో భారతీయ శాస్త్రవేత్త ప్రశాంత్ చంద్ర మహలనోబిస్ పాత్రను పోషించాడు. ఆయన ఇండియాలోనే స్థిరపడేందుకు ప్లాన్‌ చేసుకుంటన్నారని సమాచారం

Videos

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)