మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్
Breaking News
దసరా తర్వాత...
Published on Wed, 06/17/2026 - 06:05
‘రంగస్థలం’ (2018) వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత హీరో రామ్‌చరణ్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో మరో సినిమా రానున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా కథ విషయమై రెండు మూడుసార్లు రామ్‌చరణ్, సుకుమార్ సమావేశమై చర్చించుకున్నారు. కాగా, రెగ్యులర్ షూటింగ్ దసరా తర్వాత ప్రారంభం అయ్యే అవకాశం ఉందని సమాచారం.
‘పెద్ది’ చిత్రీకరణ సమయంలో రామ్‌చరణ్ చేతికి గాయమైంది. చరణ్ చేతికి శస్త్ర చికిత్స పూర్తయ్యాక కాస్త విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ లోపు ప్రీ ప్రొడక్షన్ వర్క్స్‌ను దాదాపు పూర్తి చేస్తారట సుకుమార్. ఇదంతా జరగడానికి దసరా వరకు సమయం పడుతుందట. అందుకనే దసరా పండగ తర్వాత ఈ సినిమా షూట్‌ను ఆరంభించాలని సుకుమార్ ప్లాన్ చేస్తున్నారట. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మించనున్నారు.
Tags : 1