Breaking News

నా కూతురికి దూరంగా ఉండాల్సి వస్తోంది : హీరోయిన్‌

Published on Mon, 01/30/2023 - 15:16

‘అత్తారింటికి దారేది, పాండవులు పాండవులు తుమ్మెద, రభస, డైనమైట్‌’ వంటి పలు చిత్రాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కన్నడ బ్యూటీ ప్రణీత. కన్నడ, తెలుగు, తమిళ్, హిందీ చిత్రాల్లో నటించిన ప్రణీత మలయాళ ఇండస్ట్రీకి పరిచయమవుతున్నారు. మలయాళ స్టార్‌ హీరో దిలీప్, దర్శకుడు రతీష్‌ రఘునందన్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతోంది.

చదవండి: నేను కూడా కాస్టింగ్‌ కౌచ్‌ బాధితురాలినే: నయన్‌ సెన్సేషనల్‌ కామెంట్స్‌

దిలీప్‌ కెరీర్‌లో 148వ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రణీత హీరోయిన్‌గా నటిస్తున్నారు. ‘‘మాలీవుడ్‌లో హీరోయిన్‌గా పరిచయమవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అయితే మలయాళంలో డైలాగ్స్‌ చెప్పడం కాస్త కష్టంతో కూడినపనే.. ప్రస్తుతం నా ముందున్న చాలెంజ్‌ అదే. ఈ మూవీలో కాస్త అహం ఉన్న యువతి పాత్రలో కనిపిస్తాను.

చదవండి: కర్ణాటకలో సింగర్‌ కైలాష్‌ ఖేర్‌పై దాడి.. తృటిలో తప్పిన ప్రమాదం

నేను అమ్మగా మారిన తర్వాత ఒప్పుకున్న తొలి సినిమా ఇది. ఈ మూవీ కోసం నా కుమార్తె ఆర్నాకు దూరంగా ఉండాల్సి వస్తోంది. అయితే వ్యక్తిగత జీవితాన్ని, వృత్తి జీవితాన్ని నేను బ్యాలెన్స్‌ చేయాలనుకుంటున్నాను.. ఇందుకోసం కష్టపడతాను’’ అని పేర్కొన్నారు ప్రణీత. కాగా 2021 మే 30న నితిన్‌ రాజును వివాహం చేసుకున్న ప్రణీత గత ఏడాది ఆర్నాకు జన్మనిచ్చారు.

Videos

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)