Breaking News

ప్రదీప్‌ రంగనాథన్‌ కొత్త సినిమా.. విడుదలపై నయనతార ప్రకటన

Published on Mon, 05/12/2025 - 11:15

ప్రదీప్‌ రంగనాథన్‌, కృతిశెట్టి( Krithi Shetty) జంటగా నటిస్తున్న చిత్రం  'ఎల్‌ఐకే' (లవ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ) విడుదలపై ప్రకటన వచ్చేసింది. లవ్‌ టుడే, డ్రాగన్‌ చిత్రాలతో వరుస హిట్లు అందకున్న ప్రదీప​ రంగనాథన్‌ ఇప్పుడు హ్యాట్రిక్‌ విజయంపై కన్నేశాడు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని చిత్ర నిర్మాత నయనతార (Nayanthara) ప్రకటించింది. విఘ్నేష్‌ శివన్‌( Vignesh Shivan) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అనిరుధ్‌ దీనికి స్వరాలు అందిస్తున్నారు.

భారీ బడ్జెట్‌తో టైమ్‌ ట్రావెల్‌ నేపథ్యంలో 'ఎల్‌ఐకే' చిత్రం తెరకెక్కింది. సెప్టెంబర్‌ 18న ఈ మూవీని విడుదల చేయనున్నట్లు నయనతార అధికారికంగా ప్రకటించింది. తమిళ్‌తో పాటు, తెలుగు, కన్నడ, మలయాలంలో తెరకెక్కుతున్నట్లు తెలిపారు. ప్రేమ కోసం మొబైల్‌ గాడ్జెట్‌ను ఉపయోగించి 2035 వరకు టైమ్‌ ట్రావెల్‌ చేసే వ్యక్తి పాత్రలో ప్రదీప్‌ రంగనాథన్‌ కనిపించనున్నారు. ఇందులో ఎస్‌జే సూర్య కీలకపాత్రలో నటిస్తున్నారు. 

సినిమా బడ్జెట్‌ భారీగా ఉండటంతో  ఐదుగురు కలిసి ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. వారిలో నయనతార ఒకరు కావడం విశేషం.  జీవితానికి ఇన్సూరెన్స్‌ ఉంటుందని అందరికీ తెలుసు. కానీ, ప్రేమకి ఉండే ఇన్సూరెన్స్‌ గురించి ఈ చిత్రంలో తెలుసుకుంటారని గతంలో దర్శకుడు తెలిపాడు. భవిష్యత్తు నేపథ్యంలో రాసుకున్న కథ కాబట్టి ఖర్చుతో పాటు సమయం కూడా ఎక్కువే పడిందని ఆయన అన్నాడు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)