Breaking News

న్యూ ఇయర్‌ సర్‌ప్రైజ్‌.. స్పిరిట్‌ ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌

Published on Thu, 01/01/2026 - 07:17

ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న పాన్‌ ఇండియా సినిమాల్లో స్పిరిట్‌ ఒకటి. దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా నాలుగేళ్ల క్రితమే ఈ ప్రాజెక్టును ప్రకటించగా కొద్దిరోజుల క్రితమే షూటింగ్‌ మొదలుపెట్టారు. ఆ మధ్య ప్రభాస్‌ బర్త్‌డే స్పెషల్‌గా ఓ చిన్నపాటి గ్లింప్స్‌ వీడియో రిలీజ్‌ చేశారు. ఇప్పుడేమో కొత్త ఏడాది 2026కి స్వాగతం పలుకుతూ డార్లింగ్‌ ఫ్యాన్స్‌కు ఊహించని సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు సందీప్‌ రెడ్డి వంగా.

మందు గ్లాసుతో ప్రభాస్‌
"ఇండియన్‌ సినిమా... మీ ఆజానుబాహుడిని చూడు" అంటూ సోషల్‌ మీడియాలో స్పిరిట్‌ ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌ చేశాడు. పొడవు జుట్టు, గుబురు గడ్డంతో నల్ల కళ్లద్దాలు పెట్టుకుని ఓ చేత్తో మందు గ్లాసు పట్టుకుని నిల్చున్నాడు. ఒంటినిండా గాయాలతో ఉన్న ప్రభాస్‌ నోట్లో సిగరెట్‌ పెట్టుకోగా.. ఎదుట నిల్చున్న తృప్తి డిమ్రి లైటర్‌ వెలిగిస్తోంది. ఈ పోస్టర్‌లో ప్రభాస్‌ను షర్ట్‌ లేకుండా చూపించారు. కాకపోతే బ్యాక్‌సైడ్‌ లుక్‌ను మాత్రమే రివీల్‌ చేశారు.

రెబల్‌ లుక్‌
ఒంటి నిండా గాయాలు, కట్లతో ఉన్న ప్రభాస్‌(Prabhas) ను చూస్తుంటే స్పిరిట్‌ ఎంత వైల్డ్‌గా ఉండబోతుందనేది ఇట్టే అర్థమవుతుంది. స్పిరిట్‌ మూవీలో ప్రకాశ్‌ రాజ్‌, వివేక్‌ ఒబెరాయ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. భద్రకాళి పిక్చర్స్‌ ప్రొడక్షన్స్‌, టి.సిరీస్‌ ఫిలింస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ సంగీతం అందిస్తున్నాడు.

 

 

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)