Breaking News

విదేశాల్లో స్పిరిట్‌

Published on Sun, 10/19/2025 - 04:34

హీరో ప్రభాస్, దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా కాంబినేషన్‌లో రూపొందనున్న చిత్రం ‘స్పిరిట్‌’. ఈ చిత్రంలో ‘యానిమల్‌’ సినిమా ఫేమ్‌ త్రిప్తీ దిమ్రి హీరోయిన్‌గా నటించనున్నారు. ప్రభాస్‌పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో కనిపించనున్న తొలి చిత్రం ఇది. డాక్టర్‌ పాత్రలో త్రిప్తి కనిపిస్తారనే ప్రచారం సాగుతోంది. కాగా ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ డిసెంబరు చివర్లో లేదా జనవరి ప్రారంభంలో మొదలవుతుందని సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రోడక్షన్‌ పనులు జోరుగా జరుగుతున్నాయట. కాగా ఈ  సినిమా షూటింగ్‌కి సంబంధించిన కొంత భాగాన్ని మెక్సికోలో జరపనున్నట్లు సందీప్‌ ఓ సందర్భంలో పేర్కొన్నారు.

మరి... తొలి షెడ్యూల్‌ షూటింగ్‌ మెక్సికోలోనే జరుగుతుందా? లేక హైదారాబాద్‌లోప్రారంభం అవుతుందా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. అలాగే ఈ సినిమా మేజర్‌ షూటింగ్‌ విదేశాల్లోనే జరుగుతుందట. ఈ చిత్రం సంగీత దర్శకుడు హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ కంపోజ్‌ చేసిన కొన్ని ట్యూన్స్‌ను సందీప్‌ ఆల్రెడీ ఫైనలైజ్‌ చేశారని టాక్‌. భూషణ్‌కుమార్, ప్రణయ్‌ రెడ్డి వంగా నిర్మించనున్న ఈ ‘స్పిరిట్‌’ సినిమా 2026 చివర్లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇక ప్రస్తుతం ‘ది రాజాసాబ్, ఫౌజి’ (ప్రచారంలో ఉన్న టైటిల్‌) చిత్రా లతో ప్రభాస్‌ బిజీగా ఉన్నారు.

Videos

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు