Breaking News

బాహుబలి టీమ్‌కు రానా రిప్లై.. నేను అదే చేయనిచ్చేవాడినన్న ప్రభాస్!

Published on Thu, 07/17/2025 - 19:13

టాలీవుడ్‌లో పదేళ్ల తర్వాత బాహుబలి పేరు మార్మోగిపోతోంది. తెలుగు సినిమాను ప్రపంచానికి పరిచయం చేసిన రాజమౌళి.. మరోసారి బాహుబలిని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ మూవీ రెండు భాగాలను కలిపి బాహుబలి ది ఎపిక్ పేరుతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించనుందని రాజమౌళి ప్రకటించారు. ఇటీవల బాహుహలి టీమ్ అంతా పదేళ్ల తర్వాత సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి.

దీంతో ఈ సినిమాపై సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తోంది. తాజాగా బాహుబలి టీమ్‌ ప్రశ్నకు హీరో రానా రియాక్ట్ సమాధానమిచ్చారు. కట్టప్ప బాహుబలిని చంపకపోయుంటే ఏం జరిగి ఉండేది? అని బాహుబలి టీమ్ ప్రశ్నించింది. ఇది చూసినా రానా.. నేను చంపేసేవాడిని అంటూ ఆ ట్వీట్‌కు బదులిచ్చాడు.

తాజాగా రానా రిప్లైకి.. రెబల్ స్టార్ ప్రభాస్ సైతం స్పందిచాడు. రానా ఇచ్చిన ఆన్సర్‌ను పోస్ట్ చేస్తూ ప్రభాస్‌ రిప్లై ఇచ్చారు. 'రూ.1000 కోట్ల కలెక్షన్స్‌ సాధించిన ఈ సినిమా కోసం.. నేను అదే చేయనిచ్చేవాడినిలే భళ్లా' అంటూ ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేశారు. వీరిద్దరి మధ్య జరిగిన సరదా చర్చ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ఈ సినిమాను 'బాహుబలి: ది ఎపిక్' పేరుతో అక్టోబర్ 31న థియేటర్లలో విడుదల చేస్తున్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)