ఇటలీలో భారీ విల్లా కొనుగోలు చేసిన ప్రభాస్‌?

Published on Sun, 03/22/2026 - 10:27

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ ఆస్తుల గురించి ఏదో ఒక పుకారు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటుంది. ఆయనకు విదేశాల్లో భారీ ఆస్తులు ఉన్నట్లు కూడా గతంలో వార్తలు వచ్చాయి. తాజాగా మరో క్రేజీ గాసిప్‌ నెట్టింట హల్‌ చల్‌ చేస్తోంది. అదేంటంటే.. ప్రభాస్‌ ఇటలీలో భారీ విల్లాను కొనుగోలు చేశాడట. ప్రస్తుతం ఆయనకు ఇటలీలో రెండు భారీ విల్లాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇటలీ అంటే పిచ్చి..
ప్రభాస్‌కు ఇటలీ అంటే చాలా ఇష్టం. ఖాలీ సమయం దొరికితే చాలు ఇటలీలో వాలిపోతాడు. అక్కడి వాతావరణం, లొకేషన్స్‌ అంటే ఆయనకు చాలా ఇష్టం. అందుకే ఎక్కువ సమయం ఇటలీలో గడిపేందుకు ప్రయత్నిస్తాడు. ఇప్పటికే అక్కడ ఓ భారీ విల్లాను కొనుగోలు చేశాడట. ఇటలీ వెళ్లిన ప్రతిసారి ప్రభాస్‌ అదే విల్లాలో ఉంటాడని, మిగతా సమయంలో రెంట్‌కి ఇస్తాడని గతంలో వార్తలు వినిపించాయి. వీటిపై ప్రభాస్‌ ఎప్పుడూ స్పందించలేదు.

యూరప్‌లో సెటిల్‌?
ఇండియాలో అత్యధిక పారితోషికం అందుకునే నటుడు ప్రభాస్‌. తన సంపాదనలో ఎక్కువ భాగం భూమిపైనే పెట్టేందుకు ఆసక్తి చూపుతాడట. తన బంధువులతో కలిసి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో పెట్టుబడులు పెడతారు. మరికొంత భాగాన్ని ఇలా ప్రాపర్టీస్‌ కొనుగోలు చేయడానికి కేటాయిస్తాడట. అయితే వరుసగా ఇటలీలోనే రెండు విల్లాలు కొనడంతో..ఇక భవిష్యత్తులో ప్రభాస్‌ అక్కడే సెటిల్‌ అవుతాడనే రూమర్స్‌ వినిపిస్తున్నాయి. ఇటీవల మోకాలీ సర్జరీకి కూడా ప్రభాస్‌ ఇటలీకే వెళ్లాడు.

వరస సినిమాలతో బిజీ బిజీ
‍ప్రభాస్‌ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ సంక్రాంతికి ‘ది రాజాసాబ్‌’తో ప్రేక్షకులను పలకరించాడు. ప్రస్తుతం ‘స్పిరిట్‌’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ‘అర్జున్‌ రెడ్డి, కబీర్‌ సింగ్, యానిమల్‌’ చిత్రాల ఫేమ్‌ సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్నారు. ‘యానిమల్‌’ మూవీ ఫేమ్‌ త్రిప్తీ దిమ్రీ హీరోయిన్‌గా నటిస్తుండగా, వివేక్‌ ఒబెరాయ్, ఐశ్వర్యా దేశాయ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దీంతో పాటు ఆయన నటించిన మరో పాన్‌ ఇండియా చిత్రం ‘పౌజీ’ కూడా రిలీజ్‌కు రెడీ అవుతుంది. మరోవైపు కల్కీ సీక్వెల్‌ కల్కీ 2 మూవీ షూటింగ్‌ కూడా ప్రారంభం అయింది. త్వరలోనే ఈ మూవీ షూటింగ్‌లో పాల్గొనబోతున్నాడు. 

Videos

ఎండలను కంట్రోల్ చేస్తా.. వాట్ ఈజ్ దిస్ విడ్డూరం

ధురంధర్ 2 తెలుగు వర్షన్ రిలీజ్ ఎప్పుడు? అసలు కారణం ఏంటి?

ఒక్కసారిగా బాంబుల వర్షం.. ఇజ్రాయెల్ లో భయానక పరిస్థితి

ఇదిగో దస్తగిరి స్టేట్మెంట్.. ఈ ఒక్క దానికి సమాధానం చెప్పండి చాలు

శబాష్ జగన్.. ఇది మీకే సాధ్యం.. వైఎస్ జగన్ పై కేంద్రం ప్రశంసలు

BR నాయుడు రాసలీలపై చంద్రబాబు కొత్త డ్రామా

మిత్రపక్షానికి బాబు వెన్నుపోటు.. పవన్ కు ఆహ్వానం లేదు

2 రోజులే టైం.. తర్వాత ఇరాన్ ఉండదు.. ట్రంప్ సంచలన వార్నింగ్

మహిళతో టీడీపీ నేత ఆదిరెడ్డి అప్పారావు సంచలన ఆడియో లీక్

విశాఖకు వరంలా మారిన YS జగన్ విజన్

Photos

+5

ప్రియుడిని పెళ్లాడిన బిగ్‌బాస్‌ బ్యూటీ పునర్నవి (ఫోటోలు)

+5

సంగీత సంబరం.. ట్రాఫిక్‌ సంకటం (ఫోటోలు)

+5

Ramzan celebrations : హైదరాబాద్ లో ఘనంగా రంజాన్ వేడుకలు (ఫొటోలు)

+5

బుజ్జి అభిమానితో భోజనం చేసిన 'విరోష్‌' జోడీ (ఫోటోలు)

+5

డైరెక్టర్‌గా ‘జబర్దస్త్’ కమెడియన్‌..‘కామాఖ్య’ టీజర్‌ రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

వేలాది భక్తుల మధ్య కైరుప్పల పిడకల సంబరం (ఫొటోలు)

+5

వాళ్లు అప్పుడు నాకు సూపర్‌స్టార్స్‌.. ఇప్పుడు నేను (ఫొటోలు)

+5

గద్దర్ అవార్డ్ వేడుక కోసం అక్కినేని కోడలు ఇలా (ఫొటోలు)

+5

మంచు విష్ణు కూతుళ్లని చూశారా? ఎంత పెద్దోళ్లయిపోయారో! (ఫొటోలు)

+5

గద్దర్‌ అవార్డ్స్‌- 2025లో మెరిసిన హీరోయిన్లు (ఫోటోలు)