'కల్కి' రికార్డుల పరంపర.. నైజాం, ఓవర్సీస్‌లో తగ్గేదే లే

Published on Sat, 07/06/2024 - 11:20

ప్రభాస్ 'కల్కి' థియేటర్లలోకి వచ్చి వారం దాటిపోయింది. ఓవరాల్‌గా హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతానికైతే రూ.800 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు తెలుస్తున్నాయి. మరోవైపు ఈ సినిమా వల్ల అక్కడా ఇక్కడా అనే తేడా లేకుండా రికార్డులు బద్ధలవుతున్నాయి. తాజాగా ప్రభాస్ ఖాతాలో మరికొన్ని రికార్డులు చేరడం విశేషం.

(ఇదీ చదవండి: డైరెక్టర్ రాజమౌళి జీవితంపై సినిమా.. ఓటీటీలో నేరుగా రిలీజ్)

ఈ సినిమాకు మన దగ్గర కంటే ఓవర్సీస్‌లో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఎందుకంటే మిగతా హీరోలు ఒకటి లేదా రెండు మిలియన్ డాలర్ల మార్క్ అందుకోవడమే కష్టంగా మారుతుంటే.. 'కల్కి'తో ప్రభాస్ ప్రస్తుతం 14.5 మిలియన్ డాలర్ల మార్క్ అందుకున్నాడు. ఇప్పటివరకు ఆర్ఆర్ఆర్ రెండో స్థానంలో 14.3 మిలియన్ డాలర్స్‌తో ఉండగా ఇప్పుడు దీన్ని 'కల్కి' అధిగమించేసింది.

మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ.242 కోట్ల మేర గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఒక్క నైజాంలోనే ఏకంగా రూ.100 కోట్లని 'కల్కి' సాధించినట్లు టాక్. తమిళనాడులో రూ.24 కోట్లు, బాలీవుడ్‌లో రూ.164 కోట్లు, కర్ణాటక-తమిళనాడులో వరసగా రూ.25 కోట్లు, రూ.24 కోట్లు సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఏదేమైనా తన గత చిత్రాల కలెక్షన్స్ రికార్డులని ప్రభాసే అధిగమిస్తుండటం విశేషం.

(ఇదీ చదవండి: పొరపాట్లు ఒప్పుకొన్న 'కల్కి' డైరెక్టర్.. ఆ మూడు విషయాల్లో!)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)