Breaking News

ప్రభాస్‌ ఇన్‌స్టా అకౌంట్‌ మిస్‌.. హ్యాక్‌ అయ్యిందా?

Published on Sun, 10/15/2023 - 14:10

సోషల్‌ మీడియాకు కాస్త దూరంగానే ఉంటాడు ప్రభాస్‌. ఆయనకు ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌,ఎక్స్‌ అకౌంట్లు ఉన్నా.. వాటిని సినిమా ప్రమోషన్స్‌ కోసమే వాడుతుంటాడు. తాజాగా ఈ పాన్‌ ఇండియా స్టార్‌ ఇన్‌స్టా అకౌంట్‌ని ఎవరో హ్యాక్‌ చేశారు. ఇన్‌స్టాలో ప్రభాస్‌ పేరును సెర్చ్‌ చేస్తుంటే.. ‘ఈ పేజీ అందుబాటులో లేదు’అనే సందేశం వస్తోంది. ఫ్యాన్‌మేడ్‌ అకౌంట్స్‌ మాత్రం కనిపిస్తున్నాయి కానీ అఫిషియల్‌ అకౌంట్‌ మిస్‌ అయింది. ప్రస్తుతం హ్యాక్‌ అయిన అకౌంట్‌ని వెనక్కి తీసుకువచ్చేందుకు ప్రభాస్‌ టీమ్‌ ప్రయత్నిస్తోంది. 

కాగా, జులై నెలలో ప్రభాస్‌ ఫేస్‌ బుక్‌ అకౌంట్‌ కూడా హ్యాకింగ్‌కు గురైంది. ‘మనుషులు దురదృష్టవంతులు’ అంటూ హ్యాకర్లు ప్రభాస్‌ అకౌంట్‌ నుంచి ఓ వీడియో వదిలారు. అది చూసి ప్రభాస్‌ ఫ్యాన్స్‌ అంతా కంగారు పడ్డారు. దీంతో తన అకౌంట్‌ హ్యాక్‌ అయినట్లు ప్రభాస్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మళ్లీ ఇప్పుడు ఇన్‌స్టా అకౌంట్‌ హ్యాక్‌ అవ్వడం పట్ల ఫ్యాన్స్‌ అసహనం వ్యక్తం చేస్తున్నారు. యాంటీ ఫ్యాన్సే హ్యాక్‌ చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

ప్రభాస్‌ సినిమా విషయాలకొస్తే.. డిసెంబర్‌ 22న సలార్‌ పార్ట్‌ 1 విడుదల కాబోతుంది. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శృతీహాసన్‌ హీరోయిన్‌గా నటించింది. ప్రస్తుతం నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో కల్కీ 2898 ఏడీ  చిత్రంలో నటిస్తున్నాడు. అలాగే మారుతి దర్శకత్వంలో రాజా డీలక్స్‌, సందీప్‌ వంగతో స్పిరిట్‌ చిత్రాల్లో ప్రభాస్‌ నటించనున్నాడు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)