Breaking News

ప్రభాస్ ఫస్ట్‌లుక్ డిలీట్.. దానికి భయపడ్డారా?

Published on Thu, 07/20/2023 - 14:28

డార్లింగ్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా 'ప్రాజెక్ట్ K'. 'మహానటి' ఫేమ్ నాగ్ అశ్విన్ డైరెక్టర్ కావడం, గత కొన్నేళ్లుగా ఈ చిత్రం సెట్స్ మీద ఉండటంతో అంచనాలు గట్టిగానే ఉన్నాయి. కానీ బుధవారం రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్‌తో అవన్నీ కాస్త తారుమారు అయ్యాయి అనిపించింది. ఎందుకంటే ప్రభాస్ లుక్‌పై ఘోరంగా ట్రోల్స్ వస్తూనే ఉన్నాయి.

ఈ ఫస్ట్ లుక్‌లో ప్రభాస్ ఐరన్ మ‍్యాన్ పోజులో కనిపించాడు. అది ఓకే గానీ ఆ తల వేరే ఎవరో బాడీకో అతికించినట్లు ఉందని స్వయానా అభిమానులే నిరుత్సాహపడ్డారు. సోషల్ మీడియాలో 'ప్రాజెక్ట్ K' టైప్ చేసి సెర్చ్ చేయండి మీకే విషయం అర్థమైపోతుంది. ఇవన్నీ మేకర్స్ దృష్టిలో పడినట్లున్నాయి. దీంతో అధికారికంగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్‌ని సోషల్ మీడియా ఖాతాల నుంచి డిలీట్ చేశారు. 

(ఇదీ చదవండి: ఇదేం ఫస్ట్ లుక్! 'ప్రాజెక్ట్ K'పై ఘోరమైన ట్రోల్స్)

అయితే ఇలా డిలీట్ చేసిన ఫస్ట్ లుక్ బదులు ఎలాంటి గ్రాఫిక్స్, పేర్లు లేకుండా ఉన్న అదే పోస్టర్‌ని పోస్ట్ చేశారు. గ్లింప్స్ వీడియో కోసం రెడీ అయిపోండి అని ట్వీట్ పెట్టారు. ఈ విషయం నిజమా కాదా అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ స్టోరీ చదివిన తర్వాత 'ప్రాజెక్ట్ K' నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ట్విట్టర్‌లోకి వెళ్లి చూడండి. మీకే క్లారిటీ వస్తుంది. 

ప్రస్తుతం జరుగుతున్న ట్రోలింగ్ ఎక్కువ కాకుడదనే ఉద్దేశంతోనే ఇలా డిలీట్ చేసినట్లు తెలుస్తోంది. మేకర్స్ తీసేసినా సరే ఆ ఫొటో ఇప్పటికీ ఎప్పటికీ అందుబాటులోనే ఉంటుంది. ఈ జాగ్రత్త ఏదో ముందు ఉంటే బాగుండేదని పలువురు నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. ఇక 'ప్రాజెక్ట్ K'లో ప్రభాస్ తోపాటు దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.

(ఇదీ చదవండి: Hidimba Review: ‘హిడింబ’ మూవీ రివ్యూ)

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)