Breaking News

అలాంటి వారు థియేటర్ల వద్ద కనిపిస్తే.. ప్రభాస్‌ ఫ్యాన్స్‌ మాస్‌ వార్నింగ్‌

Published on Fri, 06/16/2023 - 09:05

మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన 'ఆదిపురుష్' థియేటర్లలోకి వచ్చేసింది. డార్లింగ్ ప్రభాస్ రాముడిగా, కృతిసనన్ సీతగా నటించిన ఈ సినిమా.. ప్రపంచవ్యాప్తంగా 9000కి పైగా స్క్రీన్స్ లో రిలీజైంది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఎక్కడ చూసినా 'ఆదిపురుష్' హడావుడి కనిపిస్తుంది. ఇప్పటికే ఓవర్సీస్‌తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్‌ షో పడిపోయింది. టీజర్ విడుదల సమయంలో సినిమాపై కొన్ని విమర్శలు వచ్చినప్పటికీ..  ఆ తర్వాత విడుదలైన ట్రైలర్లు విమర్శలకు గట్టి సమాధానం ఇచ్చాయి. తాజాగా సినిమా కూడా భారీ విజయం సాధించడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్.

(ఇదీ చదవండి: Adipurush: ఓం రౌత్, ప్రభాస్‌ను కలిపింది ఎవరు?)

 జై శ్రీరామ్ నినాదాలతో థియేటర్స్ దగ్గర అభిమానులు సందడి చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రభాస్‌ అభిమానులు అర్ధరాత్రి నుంచే  టపాసులుపేల్చుతూ.. డప్పులు వాయిస్తూ హంగామా చేస్తున్నారు . ఉదయం నాలుగు గంటలకే ఆదిపురుష్ బెనిఫిట్ షోలు ప్రారంభం కావడంతో సినిమా చూసిన అభిమానులు ప్రభాస్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశారని అంటున్నారు.

ఇదిలా ఉంటే థియేటర్ల వద్ద రివ్యూలు చెప్పే వారికి ప్రభాస్‌ అభిమానులు ఓ సీరియస్ వార్నింగ్ ఇస్తున్నారు. ఇటీవల ఏ సినిమా విడుదల అయితే ఆ సినిమాకు సంబంధించిన గెటప్‌లు వేసుకొని వచ్చి మరీ రివ్యూలు చెప్పేవారిని చూస్తూనే ఉంటాం. అలాంటి వారి చేష్టలను చూస్తూ ఊరుకోం అని ఫ్యాన్స్‌ వార్నింగ్‌ ఇస్తున్నారు. అవతార్2 సినిమా విడుదల సమయంలో ఆ గెటప్స్ వేసుకొని కొంతమంది హల్ చల్ చేశారు.

ఇక ఇప్పుడు ఆదిపురుష్ రివ్యూలు చెప్తూ ఎవరైన హనుమంతుడు, రాముడు గెటప్‌లో వచ్చి.. పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యొద్దని హెచ్చరిస్తున్నారు ఫ్యాన్స్. లైకులు కోసం, కామెంట్స్ కోసం అలాంటి పనులు చేస్తే ఊరుకోమని ఫ్యాన్స్ వార్నింగ్‌ ఇస్తున్నారు. దేవుడి సినిమా కాబట్టి.. ఆదిపురుష్‌ ప్రదర్శించే థియేటర్ల వద్ద ఎవరూ అసభ్యంగా ప్రవర్తించకండి అంటూ వారు తెలిపారు.

(ఇదీ చదవండి: Adipurush: హనుమాన్‌కు కేటాయించిన సీట్‌ ఇదే..)

Videos

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)