Breaking News

చిన్న సినిమా కలెక్షన్స్‌పై ప్రభాస్‌ ఎఫెక్ట్‌.. వీడియో వైరల్‌

Published on Mon, 02/23/2026 - 11:15

ప్రభాస్‌ ఎంత బిజీగా ఉన్నా సరే తన వారికోసం సమయం కేటాయిస్తాడు. ప్రభాస్‌కు హిట్‌ ఇచ్చిన ‘వర్షం’ డైరెక్టర్‌ శోభన్‌ గుర్తున్నారు కదా.. ఇప్పుడు ఆయన కుమారుడు సంతోశ్‌ నటించిన కొత్త చిత్రం  ‘కపుల్‌ ఫ్రెండ్లీ’ విడుదలైంది. ఆయన మీద గౌరవంతో ‘కపుల్‌ ఫ్రెండ్లీ’ మూవీని ప్రమోట్‌ చేశారు.  చిత్ర యూనిట్‌తో ఏకంగా గంట  పాటు ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ క్రమంలో తనోక స్టార్‌ హీరో అనే విషయాన్ని కూడా డార్లింగ్‌ పక్కన పెట్టేశాడు. తనకు తొలి విజయాన్ని అందించిన దర్శకుడి కుమారుడు ఎదురుగా కనిపించడంతో ఒక హగ్‌ ఇస్తావా అంటూ అభిమానాన్ని చాటుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతుంది.

ప్రభాస్‌ దెబ్బతో ‘కపుల్‌ ఫ్రెండ్లీ’ బ్రేక్‌ ఈవెన్‌
సంతోశ్‌ శోభన్‌ - మానస వారణాసి జంటగా నటించిన చిత్రం  ‘కపుల్‌ ఫ్రెండ్లీ’.. దర్శకుడు  అశ్విన్‌ చంద్రశేఖర్‌ తెరకెక్కించిన ఈ మూవీని యూవీ క్రియేషన్స్‌ సమర్పణలో పి.అజయ్‌ కుమార్‌ రాజు నిర్మించారు. సుమారు రూ. 7 కోట్ల బడ్జెట్‌తో పూర్తి అయిన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద ఇప్పటికే రూ. 6.80 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఈ చిత్రం బ్రేక్‌ ఈవెన్‌ పూర్తి చేసుకుంది. ప్రాస్‌ ఇంటర్వ్యూ తర్వాత ఈ సినిమాకు మరింత బజ్‌ క్రియేట్‌ అయింది. ఈ వీకెండ్‌లో చాలా థియేటర్స్‌ హౌస్‌ఫుల్‌ అయ్యాయి. తెలంగాణలో 400 షోలు, ఆంధ్రాలో 600 షోలు, కర్ణాటకలో 125 షోలు ప్రదర్శించినట్టు ట్రేడ్ రిపోర్ట్. అయితే, ప్రభాస్‌ ఇంటర్వ్యూ తర్వాత ఈ సంఖ్య మరింత పెరిగింది. ఫైనల్‌గా ఈ మూవీ భారీ లాభాలను తెచ్చిపెడుతుందని ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి.

‘కపుల్‌ ఫ్రెండ్లీ’ చూసి ఆ ఫీల్‌ నుంచి బయటకు రావడానికి చాలాసేపు పట్టిందని తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో ప్రభాస్‌ (Prabhas) అన్నారు. ఈ మూవీ క్లైమాక్స్‌లో వచ్చే 20 నిమిషాలు మరో స్థాయిలో ఉందని ప్రశంసించారు. హీరో సంతోశ్‌ శోభన్‌ అడిగిన వెంటనే అతడికి ఫోన్‌ నంబరు ఇచ్చారు ప్రభాస్‌.  తనకు ‘వర్షం’ సినిమాలా.. సంతోశ్‌కి ఈ మూవీ  గుర్తుండిపోయేలా అవుతుందని డార్లింగ్‌ చెప్పారు.

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)