Breaking News

ప్రాజెక్ట్- కె.. తన క్యారెక్టర్‌పై ప్రభాస్ ఆసక్తికర కామెంట్స్!

Published on Fri, 07/21/2023 - 13:50

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ప్రాజెక్ట్‌ కె’. ఈ చిత్రంలో దీపికా పదుకోణె హీరోయిన్‌గా నటిస్తోంది. అంతే కాకుండా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో అమితాబ్‌ బచ్చన్, దిశా పటానీ, కమల్‌ హాసన్‌ కూడా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించి వరుస అప్‌డేట్స్‌ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు మేకర్స్. ఇటీవలే ప్రభాస్ ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ కూడా రిలీజైన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ మూవీ టైటిల్‌,గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. 

(ఇది చదవండి: బిగ్‌ బాస్‌ హౌస్‌లోకి బేబీ హీరోయిన్.. సోషల్ మీడియాలో వైరల్!)

ఈ భారీ బడ్జెట్ టైమ్‌ట్రావెల్‌ సైన్స్ ఫిక్షన్  ఫిల్మ్‌ ‘ప్రాజెక్ట్‌ కె’  గ్లింప్స్‌ను  ‘కామిక్‌ కాన్ –2023’ వేడుకల్లో మేకర్స్‌ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ హాలీవుడ్‌ సినిమాను తలపిస్తున్నాయంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాకు 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD) అనే టైటిల్‌ ఖరారు చేశారు. పురాణాల ప్రకారం కలియుగం చివర్లో విష్ణువు పదో అవతారమే కల్కి. ప్రపంచాన్ని చీకటి కమ్మేసినప్పుడు ఒక శక్తిలా కల్కి ఉద్భవిస్తుందని మన పురాణాల్లో ఉంది. కలియుగం అంతంలో జరిగే కథా నేపథ్యంలో ఈ చిత్రం ఉండనున్నట్లు తెలుస్తోంది.  అయితే ఈ ప్రతిష్ఠాత్మక ఈవెంట్‌కు హాజరైన హీరో ప్రభాస్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అక్కడి స్థానికి మీడియాతో మాట్లాడుతూ డైరెక్టర్‌పై ఫన్నీ కామెంట్స్ చేశారు.

ప్రభాస్ మాట్లాడుతూ.. 'ఇది ఒక సూపర్ హీరో సినిమా. ఇందులో అతి ముఖ్యమైన అంశం కామెడీ. నాగ్ అశ్విన్ ఈ స్టోరీని డిజైన్ చేసిన విధానం నాకు నచ్చింది.  నా క్యారెక్టర్‌ను అలా తీర్చిదిద్దారు. ఈ ప్రాజెక్ట్‌లో ఫన్నీ క్యారెక్టర్ నాదే అనుకుంటా. ఈ చిత్రంలో స్ట్రాంగ్ ఎమోషన్స్‌ కూడా నాగ్ చూపించాడు. ఐ యామ్ ది కమెడియన్ ఇన్ దిస్ మూవీ. అంటూ' నవ్వుతూ మాట్లాడారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ చిత్రం కోసం ప్రభాస్ ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

(ఇది చదవండి: ఆ టాలీవుడ్‌ హీరోతో కలిసి కచ్చితంగా సినిమా చేస్తాను: ప్రభాస్‌)

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)