Breaking News

రెమ్యునరేషన్‌లోనూ ప్రభాస్‌ రికార్డు.. ‘స్పిరిట్‌’ కోసం అన్ని కోట్లా?

Published on Fri, 12/05/2025 - 15:36

పాన్ ఇండియా సినిమాల్లో 'నంబర్ వన్ హీరో' అంటే అందరూ చెప్పే  మొదటి పేరు ప్రభాస్. 'బాహుబలి' సినిమా విడుదలైన తర్వాత అతని ఇమేజ్ గ్లోబల్ లెవెల్‌కు చేరింది. ఫ్లాప్ సినిమాలు వచ్చినా, అతని చిత్రాలు రూ. 500 కోట్లకు పైగా వసూళ్లు చేస్తూనే ఉన్నాయి. ఈ ఇమేజ్ వల్లే ప్రభాస్ పారితోషికం కూడా ఆకాశాన్ని తాకింది. టాలీవుడ్‌లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరో అతడే. సాధారణంగా ఒక్కో సినిమాకు రూ. 100-120 కోట్లు తీసుకుంటున్నాడు. 

గత కొన్ని సంవత్సరాలుగా ప్రభాస్‌ ఇదే స్థాయిలో పుచ్చుకుంటున్నాడు. ఇది అందరికి తెలిసిన పాత వార్తే. కానీ, ఇప్పుడు మరోసారి ప్రభాస్‌(Prabhas) పారితోషికం ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే.. స్పిరిట్‌ సినిమాకు ఆయన ఇంకాస్త ఎక్కువే తీసుకుంటున్నాడట. ఈ చిత్రానికి అత్యధికంగా రూ.160 కోట్లకుపైగా పారితోషికం(Remuneration) తీసుకుంటున్నారని టాలీవుడ్‌లో టాక్‌. ప్రభాస్‌కు ఉన్న గ్లోబల్‌ మార్కెట్‌ని దృష్టిలో పెట్టుకొని నిర్మాణ సంస్థలు ఆ స్థాయితో పారితోషికం అందిస్తున్నాయి.

స్పిరిట్‌ విషయానికొస్తే.. ఈ సినిమాలో ప్రభాస్‌కి జోడీగా తృప్తి దిమ్రి నటిస్తుండగా.. ప్రకాశ్ రాజ్, వివేక్ ఒబెరాయ్ ఇతర కీలక పాత్రలు చేస్తున్నారు. వీళ్లతో పాటు బాలీవుడ్ నటి కాజోల్ కూడా మరో ముఖ్య పాత్రలో కనిపించనుందనే రూమర్ ఒకటి వినిపిస్తుంది. భద్రకాళి పిక్చర్స్‌ ప్రొడక్షన్స్, టి.సిరీస్‌ ఫిల్మ్స్‌ సంస్థలు సంయుక్తంగా రూపొందిస్తున్నాయి. భూషణ్‌కుమార్, ప్రణయ్‌రెడ్డి వంగా, క్రిషన్‌ కుమార్‌ నిర్మాతలు. హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ సంగీతం అందిస్తున్నారు. 2027లో ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం ఉంది.

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)