Breaking News

ప్రభాస్‌ మాస్టర్‌ ప్లాన్‌.. ప్లాప్ లు వచ్చిన తగ్గని ఇమేజ్‌!

Published on Tue, 03/28/2023 - 14:45

హీరోలకు సినిమాలు ప్లాప్ అయితే మార్కెట్ తో పాటు...ఇమేజ్ తగ్గుతుంది. కానీ ప్రభాస్ విషయంలో అలా జరగటం లేదు. రివర్స్ లో జరుగుతోంది. బాహుబలి 2 తర్వాత ప్రభాస్ ఇమేజ్  పాన్ ఇండియా దాటి...గ్లోబల్ రేంజ్ కి పెరిగిపోయింది. ఈ సినిమా తర్వాత ప్రభాస్  పాన్ ఇండియా మూవీస్ పైనే పోకస్ పెట్టాడు. బాహుబలి తర్వాత విడుదలైన రెండు సినిమాలు ప్రభాస్ ఇమేజ్ ను టచ్ చేయలేకపోయాయి.అయినా ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఏ పాన్ ఇండియా హీరో చేతిలో లేనన్ని  సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాలతో పాన్ వరల్డ్ రేంజ్ లో సత్తా చాటేందుకు రెడీ గా ఉన్నాడు ప్రభాస్‌..

బాహుబలి తర్వాత భారీ బడ్జెట్ సినిమాలకు ప్రభాస్ కేరాఫ్‌ అడ్రస్ గా మారిపోయాడు. బాహుబలి ది కన్ క్లూజన్ తర్వాత ప్రభాస్... సుజిత్ దర్శకత్వంలో సాహో సినిమాలో నటించాడు. బాహుబలి తర్వాత మూవీ కావటంతో పాన్ ఇండియా రేంజ్ లో  మంచి హైప్ క్రియేట్ అయింది. అయితే ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో సౌతిండియా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. బాలీవుడ్ లో మాత్రం మంచి వసూళ్లు రాబట్టింది. 

ఇక సాహో తర్వాత ప్రభాస్ నటించిన పిరియాడికల్ లవ్ స్టోరీ రాధేశ్యామ్. హై బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాపీస్ దగ్గర బోల్తా పడింది. బ్యాక్ టూ బ్యాక్ ప్రభాస్ రెండు పాన్ ఇండియా సినిమాలు ప్లాప్ అయ్యాయి. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ విపరీతంగా డిస్పాయింట్ అయ్యారు. అప్పుడు ప్రభాస్ తన  రూట్ మార్చాడు.  తన మూవీ సెలక్షన్ దగ్గర నుంచే హైప్ క్రియేట్ ప్లాన్ చేసుకున్నాడు. అదే తనకి ఇప్పుడు ప్లస్ గా మారింది.

రాదేశ్యామ్ తర్వాత ...బాలీవుడ్ లో డెబ్యూ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. ఓంరౌత్ దర్శకత్వంలో మైధిలాజికల్ మూవీ ఆదిపురుష్‌ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ మూవీలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నాడు. ప్రభాస్ బాలీవుడ్ మూవీలో నటిస్తున్నాడనే మాట...రాముడిగా కనిపించనున్నాడనే విషయం తెలియటంతో ఫ్యాన్స్ లో జోష్ వచ్చింది. ఆ తర్వాత ఫుల్ మాస్ అండ్ యాక్షన్‌ మూవీ చేయాలని డిసైడ్ అయ్యాడు. 

ఇందుకోసం కేజీయఫ్‌ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో సలార్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాడు. కేజీఎఫ్‌ తర్వాత ప్రశాంత్ నీల్ చేస్తున్న సినిమా సలార్..దీంతో సినిమా పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. బొగ్గు గనుల నేపథ్యంలో తెరకెక్కుతున్న సలార్ ఫస్ట్ లుక్ పోస్టర్ లో ప్రభాస్ అదిరిపోయింది. దీంతో బ్యాక్ టూ బ్యాక్ రెండు ప్లాప్ ఇచ్చిన ప్రభాస్ ఈ సారి ఖచ్చితంగా హిట్ కొడతాడనే నమ్మకం ఫ్యాన్స్ లో కలిగింది. 

ప్రభాస్ తన పక్కా ప్లానింగ్ తోనే తనకి వచ్చిన గ్లోబల్ స్టార్ కి ఇమేజ్ డ్యామేజ్ జరగకుండా చూసుకున్నాడు. ఇక రెండు సినిమాల తర్వాత డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో హాలీవుడ్ రేంజ్ లో ఓ సైన్స్ ఫిక్షన్ మూవీలో నటిస్తున్నాడు. దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాలో అమితాబ్, దీపికా పదుకునే నటిస్తున్నారు.ఇక ఈ సినిమా ఇంగ్లీష్ లో డబ్ చేసి హాలీవుడ్ లో కూడా రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు మేకర్స్..

అయితే ఇప్పుడు ఆర్‌ఆర్‌ఆర్‌ ఆస్కార్ సాధించటంతో...హాలీవుడ్ లో తెలుగు సినిమాలపై ఇంట్రెస్ట్ పెరిగింది. దీంతో ఆదిపురుష్‌ మాత్రమే కాదు...సలార్ సినిమా కూడా ఇంగ్లీష్‌ లో డబ్ చేసి హాలీవుడ్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్...ఇక సలార్ సినిమా అయితే పాటలు..కామెడీ ట్రాక్ లేకుండా హాలీవుడ్ లో రిలీజ్ చేస్తారనే మాట వినిపిస్తోంది. సెట్స్ పై ఈ మూడు సినిమాలు మాత్రమే కాదు మరో సినిమా కూడా వుంది. 

డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ఓ సినిమాలో  నటిస్తున్నాడు ప్రభాస్..ఈసినిమాకి సంబంధించి అఫిషియల్ అనౌన్స్మెంట్ చేయకుండానే...షూటింగ్ స్టార్ట్ చేశారు. ఈ ఏడాది లో ప్రభాస్ ఆదిపురుష్‌. సలార్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. జూన్ 16న ఆదిపురుష్‌, సెప్టెంబర్ 28 సలార్ విడుదలకి సిద్దంగా వున్నాయి. తన ప్లానింగ్ తో కెరీర్ కు డ్యామేజ్ కాకుండా చూసుకున్నాడు ప్రభాస్. తన చేతిలో ఉన్న సినిమాలు హిట్ అయితే ప్రభాస్ ఇమేజ్ నెక్ట్స్ లెవల్‌కి వెళ్లడం ఖాయమని ఫ్యాన్స్‌అంటున్నారు. 

Videos

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)