Breaking News

కాంతార నిజమైన మాస్టర్ పీస్.. ప్రభాస్‌, సందీప్‌రెడ్డి ఏమన్నారంటే?

Published on Fri, 10/03/2025 - 11:44

కాంతార ఛాప్టర్ 1(Kantra chapter 1)తో రిషబ్ శెట్టి  భారీ విజయాన్ని అందుకున్నారు. అక్టోబర్‌ 2న విడుదలైన ఈ మూవీపై పాన్‌ ఇండియా రేంజ్‌లో పాజిటివ్‌ రివ్యూలే వినిపిస్తున్నాయి. కాంతార చిత్ర యూనిట్‌పై ఇప్పటికే జూనియర్‌ ఎన్టీఆర్‌ రియాక్ట్‌ అయ్యారు. తాజాగా ప్రభాస్‌(Prabhas ), సందీప్‌రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) స్పందించారు. వారు సినిమాపై ప్రశంసలు కురిపించారు. బుక్‌మైషోలో కాంతార టికెట్ల సేల్‌ భారీగానే ఉంది. పీక్‌ టైమ్‌లో ప్రతి గంటకు సుమారు 60వేల టికెట్లు అమ్ముడుపోతున్నాయి. 24గంటలకు ఏకంగా 5లక్షలకు పైగానే టికెట్లు అమ్ముడుపోతున్నాయి.

దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా కాంతార చాప్టర్‌1పై ఇలా చెప్పారు. 'కాంతార చాప్టర్ 1 నిజమైన మాస్టర్ పీస్. ఇండియన్ సినిమా ఇంతకు ముందు ఇలాంటి చిత్రాన్ని ఎప్పుడూ చూడలేదు. ఇది ఒక సినిమాటిక్ ప్రభంజనం. స్వచ్ఛమైన భక్తి ఎలా ఉంటుందో ఇందులో చూపించారు.  దీనిని ఎవరూ దాటలేరు. ఈ చిత్రంలో రిషబ్ శెట్టి నిజమైన వన్-మ్యాన్ షో ప్రదర్శించారు. ఈ మూవీని ఒంటి చేత్తో రూపొందించడమే కాకుండా ముందుకు తీసుకెళ్లాడు. కాంతార బీజీఎమ్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం చాలా బాగుంది.' అని ఆయన మెచ్చుకున్నారు.

కాంతార ఛాప్టర్ 1 మూవీ విడుదలైన  కొన్ని గంటల్లోనే ప్రభాస్ ఇలా పోస్ట్‌ చేశారు. 'కాంతార ఛాప్టర్ 1 బ్రిలియంట్ మూవీ. ఇందులో నటించిన వారందరి ప్రతిభ చాలా బాగుంది. ఈ ఏడాది అతిపెద్ద విజయంగా కాంతార1 నిలుస్తుంది. ఈ సినిమాకు ప్రధాన బలయం రిషబ్ శెట్టి నటన. ఆపై హోంబలే ఫిల్మ్స్ విజయ్ కిరగండూర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ విజయం సాధించిన చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు.' అని ప్రభాస్ తన స్టోరీలో రాశాడు.

 

Videos

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు