Breaking News

ప్రభాస్‌, హను రాఘవపూడి కొత్త సినిమా టైటిల్‌ ప్రకటన

Published on Thu, 10/23/2025 - 11:08

ప్రభాస్‌,  హను రాఘవపూడి (Hanu Raghavapudi) కొత్త సినిమా టైటిల్‌ను ప్రకటించేశారు. నేడు (అక్టోబర్‌ 23) డార్లింగ్‌ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ ఒక పోస్టర్‌ను విడుదల చేశారు. ముందుగా అనుకున్నట్లుగానే ఈ మూవీకి “ఫౌజీ” అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామాగా ఈ సినిమా రానుంది. మైత్రీ మూవీ మేకర్స్‌ భారీ బడ్జెట్‌తో ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. 1930వ దశకంలో జరిగిన సంఘటనల ఆధారంగా వాటికి కొంత ఫిక్షన్‌ జోడించి ఈ మూవీని తెరకెక్కించనున్నారు. ఇందులో కొత్త భామ ఇమాన్వి కథానాయికగా నటిస్తోంది. మిథున్‌ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, జయప్రద వంటి స్టార్స్‌ నటిస్తున్నారు.

మన చరిత్రలోని దాగి ఉన్న అధ్యాయాల నుండి ఒక సైనికుడి ధైర్య కథను ఫౌజీలో చూపిస్తామని దర్శకుడు హను రాఘవపూడి చెప్పారు. ప్రభాస్‌ను ఫౌజీగా పరిచయం చేయడంలో తనకు చాలా గర్వంగా ఉందన్నారు. 'ఇప్పటివరకు ఈ ప్రయాణం మరపురానిది.. ఫౌజీ నుంచి ఈ జర్నీ మరింత పెద్దదిగా ఉంటుందని హామీ ఇస్తున్నా' అంటూ హను పోస్ట్‌ చేశారు.

ఈ సినిమా షూటింగ్‌ కూడా ఇప్పటికే సగంపైగానే పూర్తి అయింది.  ఫస్ట్‌ షెడ్యూల్‌ తమిళనాడులో ప్రారంభమైంది. కారైకుడి, మధురై లొకేషన్స్‌లో ప్రభాస్‌తో పాటు ప్రధాన తారాగణం పాల్గొనగా కీలక సన్నివేశాల చిత్రీకరణ చేశారణ టాక్‌. ఇక ఈ సినిమాలో ఓ బ్రాహ్మణ యువకుడి పాత్రలో ప్రభాస్‌ కనిపిస్తారని, సినిమాలో దేవీపురం అనే బ్యాక్‌డ్రాప్‌ ఉంటుందనే ప్రచారం జరుగుతోంది.

 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)