Breaking News

ఒకే వేదికపైకి రానున్న ప్రభాస్‌, అనుష్క

Published on Wed, 08/20/2025 - 13:43

ప్రభాస్‌ హీరోగా, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'బాహుబలి'. రాజమౌళి దర్శకత్వంలో శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మించిన  తొలి భాగం 'బాహుబలి: ది బిగినింగ్‌' విడుదలై ఇప్పటికే పదేళ్లు పూర్తి అయింది.  ఈ సందర్భంగా 'బాహుబలి: ది ఎపిక్‌' పేరుతో ఈ చిత్రాన్ని అక్టోబరు 31న ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. రెండు భాగాలుగా వచ్చిన బాహుబలిని  ఒకే భాగంగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. దీంతో చిత్ర యూనిట్‌ ప్రమోషన్స్‌ చేయాలని ప్లాన్‌ చేస్తుంది.

'బాహుబలి: ది ఎపిక్‌'  విడుదల సందర్భంగా ఇప్పటికే ప్రభాస్‌, రానాలతో ఒక ప్రత్యేకమైన ఇంటర్వ్యూను షూట్‌ చేసినట్లు తెలుస్తోంది. అయితే, అనుష్క కూడా ఆ టీమ్‌లో భాగం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం అనుష్క్‌ కూడా హైదరాబాద్‌లోనే ఉంది. ఆమె నటించిన 'ఘాటి' చిత్రం సెప్టెంబర్‌ 5న విడుదల కానుంది. ఈ చిత్రం ప్రమోషన్స్‌తో పాటు 'బాహుబలి: ది ఎపిక్‌'ను కూడా పూర్తి చేయాలనే ప్లాన్‌లో ఆమె ఉన్నట్లు సమాచారం. తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్‌లతో పలు ఈవెంట్లు నిర్వహించాలని మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారట.

తెలుగు సినిమా 'గ్లోబల్‌ రేంజ్‌'కి ఎదిగింది 'బాహుబలి'తోనే. ఒక రకంగా 'పాన్‌ ఇండియా' ట్రెండ్‌ ఆరంభమైనదే 'బాహుబలి'తోనే. ఈ సినిమా తర్వాత టాలీవుడ్‌పై వరల్డ్‌ సినిమా దృష్టి పడింది.  ఇలా 'బాహుబలి' సినిమా గురించి పలు ఆసక్తికరమైన విశేషాలు చాలానే ఉన్నాయి. అవన్నీ త్వరలో చిత్ర యూనిట్‌ మనకు అందించనుంది.
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)