Breaking News

త్రివిక్రమ్‌ వివాదంపై శివ బాలాజీకి కౌంటర్‌ ఇచ్చిన పూనమ్‌ కౌర్‌

Published on Mon, 01/06/2025 - 07:20

టాలీవుడ్‌ ప్రముఖ డైరెక్టర్‌ త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, సినీ నటి పూనమ్‌ కౌర్‌ (Poonam Kaur) మధ్య వివాదం కొన్నేళ్లుగా నడుస్తోంది. తాజాగా ఆమె మా అసోసియేషన్‌ను తప్పు పడుతూ ఒక ట్వీట్‌ చేసింది.  త్రివిక్రమ్ వేధింపుల వల్లే తన కెరీర్‌ నాశనమైందని ఆరోపించింది. ఈ విషయంపై మా అసోసియేషన్‌కు ఫిర్యాదు చేసి చాలా ఏళ్లు అయిందని తెలిపింది. తన ఫిర్యాదు గురించి ఎవరూ కూడా పట్టించుకున్నపాపాన పోలేదని సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేసింది. త్రివిక్రమ్‌పై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని రాసుకొచ్చింది. అందుకు కౌంటర్‌గా  మా అసోసియేషన్‌ తరఫున నటుడు, కోశాధికారి శివ బాలాజీ (Siva Balaji) రియాక్ట్‌ అయ్యారు. ఆమె నుంచి తముకు ఎలాంటి రాతపూర్వక ఫిర్యాదు రాలేదని అన్నారు. గతంలో ఆమె ఫిర్యాదు చేసినట్లు రికార్డుల్లో కూడా లేదని తెలిపారు. ఇందుకు సమాధానంగా పూనమ్‌ మరోసారి రియాక్ట్‌ అయింది.

మా అసోసియేషన్ ట్రెజరర్ శివబాలాజీకి  పూనమ్ కౌర్ కౌంటర్‌గా ఇచ్చింది. గతంలో త్రివిక్రమ్‌పై (Trivikram Srinivas) తాను చేసిన ఫిర్యాదుకు మా అసోసియేషన్ నుంచి   గతంలో వచ్చిన మెసేజ్‌ని  పూనమ్ కౌర్ పోస్ట్‌ చేసింది. తనను కలవడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపిన మా అసోసియేషన్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదంటూ ఆమె పేర్కొంది.  మా అసోసియేషన్ నుంచి పూనమ్‌కు వచ్చిన మెసేజ్‌లో ఇలా ఉంది. 

(ఇదీ చదవండి: రజనీకాంత్‌ను మెప్పించిన అభిమాని.. ఇంటికి పిలిచి గిఫ్ట్‌తో సత్కారం)

'త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై ఫిర్యాదుకు సంబంధించి మీ మెయిల్ మాకు అందింది. మీ అభ్యర్థన మేరకు, తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రాంగణంలో అంగీకరించిన తేదీ, సమయానికి ఇద్దరు పరిశ్రమకు చెందిన మహిళా సభ్యులతో పాటు మరోఇద్దరు మహిళా పరిశ్రమేతర సభ్యులతో ఇక్కడి ప్యానెల్‌లో మిమ్మల్ని కలవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఈ సమావేశం మొత్తం మహిళా ప్యానెల్‌గా ఉండాలని మీరు అభ్యర్థించారు. ఈ విషయంలో మేము ఎలా కొనసాగించాలో  మీ కేసును స్పష్టమైన పద్ధతిలో చెప్పగలరని  ఆశిస్తున్నాము.'

త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ గురించి  పూనమ్‌ కౌర్‌ ఇప్పటికే చాలాసార్లు చెప్పుకొచ్చింది. సోషల్‌మీడియా వేదికగా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఆమె విమర్శలు చేస్తూనే ఉంది. సినిమా అవకాశాల పేరుతో తనను మోసం చేసేందుకు ప్రయత్నించారని.. తన కోరిక తీర్చకపోవడంతో ఇండస్ట్రీలో ఎదగకుండా తొక్కేసారని పూనమ్‌ కౌర్‌ ఆరోపిస్తోంది. అయితే ఆమె ట్వీట్స్‌పై త్రివిక్రమ్‌ ఇంతవరకు స్పందించలేదు.అయితే, పూనమ్‌ బయటపెట్టిన ఆధారంతో ఇప్పుడు మా అసోసియేషన్‌ ఇరకాటంలో పడినట్లు అయింది. ఇదే క్రమంలో దర్శకుడు త్రివిక్రమ్‌కు కూడా కాస్త ఇబ్బందులు తప్పవనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)