Breaking News

వెండితెరపై మన నాయకులు

Published on Sun, 08/25/2024 - 13:19

‘మడిషన్నాక కూసింత కళాపోషణ ఉండాలా..’ అని ఓ తెలుగు సినిమాలో సినీనటుడు రావుగోపాలరావు చెప్పినట్లు.. ఉమ్మడి జిల్లాకు చెందిన రాజకీయ నాయకులు వెండితెరపై తళుక్కున మెరిసి తమలోని కళానైపుణ్యాన్ని చాటుకున్నారు. మోత్కుపల్లి నర్సింహులు, కంచర్ల భూపాల్‌రెడ్డి నిజ జీవితంలో మాదిరిగానే సినిమాల్లో కూడా ప్రజాప్రతినిధులుగా.. అద్దంకి దయాకర్‌ లీడర్‌గా పాత్రలు పోషించి తమ నటనాకౌశలంతో ప్రేక్షకులను మెప్పించారు. వెండితెరపై కనిపించిన మన నాయకులపై ప్రత్యేక కథనం..

సినిమాల్లోనూ లీడర్, ప్రజాప్రతినిధులుగా నటించిన అద్దంకి దయాకర్, మోత్కుపల్లి నర్సింహులు, కంచర్ల భూపాల్‌రెడ్డి
తమ నటనాకౌశలంతో ప్రేక్షకులను మెప్పించిన నేతలు

అర్వపల్లి: సమకాలీన రాజకీయ అంశాలు, యథార్థ సంఘటనలు, ప్రేక్షకుల్లో సామాజిక, రాజకీయ చైతన్యం కలిగించేలా బొమ్మకు మురళి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఇండియా ఫైల్స్‌ చిత్రంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఇన్‌చార్జ్, సూర్యాపేట జిల్లా ఆత్మకూర్‌(ఎస్‌) మండలం నెమ్మికల్‌ గ్రామానికి చెందిన  అద్దంకి దయాకర్‌ స్వీయ పాత్రలో నటిస్తున్నారు. నటి ఇంద్రజ కూడా ఇందులో నటిస్తోంది. భారతదేశంతో పాటు మొత్తం నాలుగు దేశాలకు సంబంధించిన భాషల్లో ఈ సినిమాను తీస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఆడియో రిలీజ్‌ కాగా డిసెంబర్‌లో సినిమా విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రజాగాయకుడు గద్దర్‌ చివరిసారిగా నటించడంతో పాటు ఆయన చివరి పాట కూడా ఉంది. ఇండియాకు సంబంధించిన 10వేల సంవత్సరాల చరిత్రను క్లుప్తంగా ఈ సినిమాలో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా 90శాతం షూటింగ్‌ పూర్తి చేసుకుంది.

ఎమ్మెల్యేగా నటించి..  
నల్లగొండ: నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి నల్లగొండకు చెందిన చిన్ని చరణ్‌ దర్శకత్వం వహించిన అదీ లెక్క సినిమాలో ఎమ్మెల్యే పాత్రలో నటించారు. ఈ సినిమా 2016లో విడుదలయ్యింది. ఈ సినిమాలో ఎమ్మెల్యే పాత్రలో నటించిన భూపాల్‌రెడ్డి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నల్లగొండ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించడం విశేషం.

సినీ నిర్మాతగా యుగంధర్‌రావు 
తుంగతుర్తి నియోజకవర్గానికి చెందిన బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు, సూర్యాపేట జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ గుజ్జ దీపిక భర్త గుజ్జ యుగంధర్‌రావు బందూక్‌ అనే సినిమాను నిర్మించారు. ఈ సినిమా 2015 జూన్‌ 19న విడుదలయ్యింది.  

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)