Breaking News

Pavithra Gowda: పవిత్రకు అందని పెట్టె

Published on Sun, 07/21/2024 - 09:46

దొడ్డబళ్లాపురం: రేణుకాస్వామి హత్య కేసులో ఏ1 నిందితురాలిగా ఉన్న నటి పవిత్రగౌడ ప్రస్తుతం పరప్పన అగ్రహార సెంట్రల్‌ జైల్లో రిమాండు ఖైదీగా ఉంది. శనివారంనాడు పవిత్రగౌడను చూడడానికి ఆమె తల్లి వచ్చారు. కూతురికి ఒక బాక్స్‌ను ఇవ్వగా జైలు సిబ్బంది నిరాకరించారు. ఇంటి నుండి తెచ్చిన తినుబండారాలను పెట్టుకోవడానికి పవిత్రగౌడ ఒక పెట్టెను తీసుకురమ్మని తల్లిని కోరిందట. అందువల్ల పవిత్ర తల్లి బాక్స్‌ను తీసుకువచ్చింది. అయితే బయటి నుండి తీసుకువచ్చే పాత్రలను లోపలకు అనుమతించబోమని, అది జైలు నిబంధన అని సిబ్బంది అడ్డుకున్నారు.   

దాడి దృశ్యాలు వీడియో?  
రేణుకాస్వామిపై దాడిని హీరో దర్శన్, అనుచరులు ఐఫోన్‌లో రికార్డు చేసినట్టు తెలిసింది. దాడిలో తీవ్రంగా గాయపడ్డ రేణుకాస్వామి స్పృహతప్పి పడిపోగానే ఒక నిందితుడు తన ఐఫోన్‌లో వీడియో తీశాడు. నిందితులకు 5 సిమ్‌కార్డులు అందజేసిన వారిని పోలీసులు విచారణ జరిపి వాంగ్మూలాన్ని రికార్డు చేసారు. దర్శన్, పవిత్ర గౌడలు తలా ఒక సిమ్‌కార్డు తీసుకున్నారు. 
    
సీఎంతో రేణుకాచార్య తల్లిదండ్రుల భేటీ
శివాజీనగర: రేణుకాస్వామి తల్లిదండ్రులు ముఖ్యమంత్రి సిద్దరామయ్యను కలిసి రేణుకాస్వామి భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని విన్నవించారు. రేణుకాస్వామి హత్య కేసులో నటుడు దర్శన్, పవిత్ర, మరో 15 మంది అరెస్టు కావడం తెలిసిందే. సీఎంను కృష్ణా నివాసంలో కలిసి తల్లిదండ్రులు తమ బాధను వెలిబుచ్చారు. అనాథగా మారిన తమ కోడలికి ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలన్నారు. సిద్దరామయ్య సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది.    

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)